- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు!
వెంకటేశ్ నిజామాబాద్ కేంద్రంగా ఓ పత్రికలో ఉద్యోగం చేసేవాడు. మేనేజ్‌మెంట్ ఆయనను హైదరాబాద్‌కు బదిలీ చేసింది. జీతం 20 వేలే కావడంతో హైదరాబాద్‌లో జాయిన్ అయ్యేందుకు ఇబ్బంది పడ్డాడు. వేరే అవకాశం లేక పోవడంతో తప్పని పరిస్థితిలో ఇద్దరు పిల్లలు, భార్యను తీసుకొని భాగ్యనగరం గడప తొక్కాడు. కాస్త తక్కువ కిరాయలు ఉంటాయని సీతాఫల్‌మండిలో సింగిల్ బెడ్ రూం ఇల్లు కిరాయకు తీసుకున్నాడు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు డ్యూటీ. పిల్లలు చిన్నవాళ్లే కావడంతో స్కూలుకు పంపలేదు.
ఓ ఆర్నెల్లు గడిచిపోయాయి. పెద్దమ్మాయిని స్కూళ్లో జాయిన్ చేయాలి. అడ్మిషన్ ఫీజు రూ. పది వేలు అడిగారు. ఎడ్యుకేషన్ పిల్లల భవిష్యత్తు కావడంతో 50 వేల చిట్టీ ఎత్తి పాపను స్కూల్లో జాయిన్ చేశాడు. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఏం చేయాలో పాలుపోలేదు. 'ఉద్యోగం వదిలేద్దామా? వదిలేస్తే బతికేదెలా? నాకు ఇది తప్ప మరోపనిరాదు' అంటూ ఆలోచించసాగాడు. ఆఫీసులో తనతో కలిసి పనిచేసే మిత్రులు జొమాటో ద్వారా ఆర్డర్ ఇచ్చి భోజనం తెప్పించుకోవడం చూశాడు. వీళ్లకు డబ్బులు ఎలా వస్తాయి. ఇందులో ఎలా జాయిన్ అయ్యేదెలా? అనుకున్నాడు. మరుసటి రోజు ఓ హోటల్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ కనిపించిన డెలివరీ బాయ్స్‌తో మాట కలిపాడు. ఆయనపేరు జమీర్. 'భాయ్ ఎట్లా గెట్ ఆన్ అవుతున్నారు? డెలివరీ బాయ్‌గా చేరేదెలా? విద్యార్హతలు ఏంటి? మీరెంత వరకు చదువుకున్నారు? రోజుకు ఎంత సంపాదిస్తారు?' అని అడిగాడు.
'నా పేరు జమీర్. మాది మెదక్ జిల్లా చేగుంట పీజీ వరకు చదువుకున్నా. ఉద్యోగాల వేటలో భాగంగా హైదరాబాద్ వచ్చా. ఆరు నెలల వరకు ఇంటి నుంచి డబ్బులు పంపారు. నేను కూడా క్యాంపస్‌లో నాన్ బోర్డర్‌గా ఉండి బాగా ప్రిపేర్ అయ్యాను. నోటిఫికేషన్లు రాలేదు. హాస్టళ్లు మూసేశారు. కరోనా కష్టకాలం కావడంతో నేను సొంతూరు బాటపట్టాను. తల్లిదండ్రుల సంపాదన మీదే కుటుంబం గడిచింది. చుట్టుపక్కల వాళ్ల సూటిపోటి మాటలు నన్ను బాధించాయి. 'ఇంకా తల్లిదండ్రి సంపాదన మీదే బతుకుతవా? బాగా సదువుకున్నవ్ కదా కొలువురాదా? పెండ్లి చేసుకోవా? అయ్యవ్వకు గంజివొయ్యవా?' అనేటోళ్లు. ఏం చేయాలో అర్థం కాలేదు.
ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. చావో రేవో చదివిన దగ్గరే తేల్చుకుందామని పట్నం వచ్చా. యూనివర్సిటీలో స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినయ్. ఎక్కడుండాలో అర్థం కాలేదు. బాల్ రాజ్ అనే బాల్యమిత్రుడు ఇక్కడే ఉప్పల్‌లో ఉంటున్నాడు. ఆయన దగ్గరకు వెళ్లి రెండు రోజులున్నా. బాల్‌రాజ్ ప్రైవేటు ఉద్యోగి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 10 వరకు డ్యూటీ. 10.30 వరకు ఇల్లు చేరి తిని నిద్రలోకి జారుకునేవాడు. ఉదయం ఆరింటికే లేచి. రెడీ అయ్యి బైక్ తీసేవాడు. మధ్యాహ్నం ఒంటిగంటకు రూమ్‌కు చేరుకునేవాడు. బాల్‌రాజు ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? తెలుసుకోవాలని పించింది జమీర్‌కు. 'పొద్దుపొద్దుగాళ్లనే ఎక్కడికి పోతున్నవ్‌రా బై?' అని అడిగాడు. 'ఏం చేస్తాంరా వచ్చే జీతం చాలడం లేదు. నాకు 15 వేల రూపాయల జీతం. ఇంటికి ఏం పంపాలె. చెల్లెలు పెండ్లికి చేసిన అప్పులు ఎట్లా తీర్చాలో తెలియక మరో ఉద్యోగం వెతుక్కున్నా' 'ఏం చేస్తున్నవ్, ఎంత జీతం వస్తుంది?' అని అడిగాను. జొమాటోలో డెలివరీ బాయ్‌గా చేరాను. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పని చేస్తా. రోజూ 800 నుంచి వెయ్యి రూపాయలు వస్తున్నయ్. 200 పెట్రోల్ ఖర్చు పోయినా రమారమిగా 700 వరకు మిగిలుతున్నాయ్ అని బాల్‌రాజు సమాధానం చెప్పాడు.
ఇదేదో బాగుందే అనుకున్న. 'నాకు అవకాశం ఇప్పించురా, ఏదో ఒక పనిచేయాలే కదా?' అన్న. 'నేనంటే ఇంటర్ ఫెయిలైన. డబుల్ పీజీ చదువుకొని నువ్వు ఈ పనెలా చేస్తావ్‌రా జమీర్' అన్నడు బాల్‌రాజు. 'పరవాలేదు, మనం దొంగతనం చేస్తలేం కదా, పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించుకోవడంలో తప్పేముంది.. జెర సూడురా అన్న' 'నువ్వు ఓకే అనుకుంటే ఈ రోజే వచ్చెయ్?' అంటూ జొమాటో ఆఫీసుకు తీసుకెళ్లాడు. డెలివరీ బాయ్‌గా ఎన్‌రోల్ చేయించాడు. 'ఆ రోజు నేను డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నా' అన్నడు జమీర్. రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటలవరకు డ్యూటీలో ఉంటా. పగలు 2 నుంచి 4 వరకు రెస్ట్ తీసుకొని తిరిగి బైక్ వేసుకొని వెళ్లిపోతుంటా. రాత్రి వరకు రెండు వేల రూపాయలకు తగ్గకుండా వస్తాయి. 'పెట్రోల్ రేటు పెరిగింది కదా? మూడు వందల వరకు ఖర్చవుతున్నాయి. రూ. 1,700 మిగులుతున్నాయ్.
నెలకు రమారమిగా రూ. 50 వేలు సంపాదిస్తున్నా?' అనగానే వెంకటేశ్‌కు ప్రాణం లేచొచ్చింది. ఈ పనే నేనెందుకు చేయకూడదు.. మధ్యాహ్నం వరకు చేస్తే కనీసం ఏడు వందలు వచ్చినా చాలు. ఖర్చులు వెళ్లిపోతాయి అనుకున్నాడు. అంతే జమీర్ సహాయంతో వెంకటేశ్ కూడా డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు.. ఉదయం 7 నుంచి 1 వరకు పనిచేస్తున్నాడు. రోజుకు 900 వరకు సంపాదిస్తున్నాడు. నెలకు 25 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇటీవలే ర్యాపిడోతోనూ కనెక్ట్ అయ్యాడు. ఆఫీసుకు వెళ్లే సమయంలో ర్యాపిడో ఆన్ చేసుకుంటున్నాడు. రాను, పోను ఎవరో ఒకరు ప్యాసింజర్స్ దొరుకుతున్నారు. ఇలా ఓ వంద రూపాయల వరకు ఆదాయం వస్తుంది. దీంతో ఆఫీసుకు వెళ్లే పెట్రోల్ ఖర్చు తప్పుతున్నది. పెద్దలు ఊరికెనే అంటారా. ఉపాయమున్నోడు ఉపాసం ఉండడు అని. వెంకటేశ్ కూడా మూడు ఉద్యోగాలు చేస్తున్నాడు. నెలకు రమా రమిగా 60 వేల వరకు సంపాదిస్తున్నాడు.
ఎమ్ఎస్ఎన్ చారి
79950 47580