- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ బలహీనతకు అసలు రీజన్ ఇదే!
కొన్ని సంస్థల సర్వేలు, సొంత సర్వేల ప్రకారం కాంగ్రెస్‌కు 45 నుంచి 52 సీట్లు వస్తాయని, 17 చోట్ల గట్టి పోటీ ఉంటుందని తేలింది. రాజకీయవర్గాల అంచనా కూడా ఇలాగే ఉంది. ఇలా జరగాలంటే ముందుగా పార్టీ నేతలంతా ఒక్క తాటిపైకి రావాలి. అవకాశాలను చేజిక్కించుకోవాలంటే విభేదాలను పక్కకు నెట్టాలి. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్నవారంతా సీఎం పీఠం కోసం పావులు కదుపుతున్నవారే. కాంగ్రెస్‌కు అధికారం వస్తే రేవంత్‌రెడ్డే హీరో. పార్టీలోని మెజార్టీ సీనియర్లకు ఇది మింగుడుపడని విషయం. అందుకే, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్నుంచి మొదలుకుని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, వీహెచ్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ వంటి నాయకులు రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా రచ్చకెక్కుతున్నారు.
135 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ. పాలిటిక్స్‌ను పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన పార్టీ. పార్లమెంటులో సొంత పార్టీ అధిష్టానాన్నే ఎదిరించిన హీరోలు ఆ పార్టీ నేతలు. ఇదీ కాంగ్రెస్ ఘనత. ఇప్పుడేమైంది? విభజన కోపంతో ఉన్న ఏపీలో అస్తిత్వం కోల్పోతే, ఏండ్ల కలను సాకారం చేసిన తెలంగాణలోనూ అదే పరిస్థితి. ఓసారి గత చరిత్రను చూసుకుంటే 'తెలుగోడి ఆత్మగౌరవం' నినాదంతో రాజకీయాలలోకి దిగిన ఎన్టీఆర్హవాకు కూడా కేవలం నాలుగేండ్లకే బ్రేకులువేసింది. అప్పుడు నేతలు కాంగ్రెస్‌పార్టీ కోసం, జెండా కోసం పని చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు వేరు కుంపట్లను పక్కన పెట్టారు. అధికారంలోకి వచ్చినప్పుడు అధిష్టానం ఎవరంటే వారే ముఖ్యమంత్రి, మంత్రి. ఇప్పుడు పరిస్థితి మారింది. పార్టీకి అధికారం కాదు, ముందుగా తాము గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. తమ కంటే ముందు 'ఎదుటోడు గెలువవద్దు, పక్క నేతకు అవకాశం రావద్ధు' అనే రాజకీయాలు చేస్తున్నారు. సీఎం కుర్చీ తమకు రాకున్నా ఫర్వాలేదు కానీ, పక్కోడికి మాత్రం దక్కవద్దనే కుటిల రాజకీయాలే హస్తం నేతలను జనాలకు దూరం చేస్తున్నాయి.
స్వయంకృతాపరాధంతోనే
టీఆర్‌ఎస్ బలహీనపడుతోందనిపసిగట్టిన బీజేపీ తెలంగాణపై కన్నేసింది. ఒక్కప్పుడు పట్టణాలలో ఏదో మూలన ఒకటి, రెండు జెండాలతో కనిపించే కాషాయం ఇప్పుడు గ్రామాలకు చేరింది. ఇది కాంగ్రెస్ స్వయంకృపారాధమే. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితులలో టీఆర్‌ఎస్‌ను పక్కనపెడితే అధిక ఓటు బ్యాంకు, గ్రామస్థాయిలో బలం ఉన్న పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చిన పార్టీగానూ కొంత సానుభూతి ఉంది. ఇదే సమయంలో అటు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తూనే ఉంది. గ్యాస్, పెట్రో, నిత్యావసరాల ధరల పెంపు కూడా బీజేపీపై ప్రభావం చూపుతున్నది. ఇన్ని అవకాశాలున్నా కాంగ్రెస్‌పార్టీ మాత్రం అధికారం వైపు అడుగులు వేయడం లేదు. 'రండి, మీకు అధికారం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం' అంటూ జనాలు పిలుస్తున్నా కాలు కదపడం లేదు. ఇంటికి వచ్చిన అదృష్టాన్ని తలుపులు వేసి తిప్పి పంపినట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. విభేదాలు, విమర్శలు, ఫిర్యాదులతోనే కాలం గడుపుతూ ప్రజలకు దూరమవుతున్నారు.
కుర్చీ తర్వాత, ముందు కలవండి
కొన్ని సంస్థల సర్వేలు, సొంత సర్వేల ప్రకారం కాంగ్రెస్‌కు 45 నుంచి 52 సీట్లు వస్తాయని, 17 చోట్ల గట్టి పోటీ ఉంటుందని తేలింది. రాజకీయవర్గాల అంచనా కూడా ఇలాగే ఉంది. ఇలా జరగాలంటే ముందుగా పార్టీ నేతలంతా ఒక్క తాటిపైకి రావాలి. అవకాశాలను చేజిక్కించుకోవాలంటే విభేదాలను పక్కకు నెట్టాలి. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్నవారంతా సీఎం పీఠం కోసం పావులు కదుపుతున్నవారే. కాంగ్రెస్‌కు అధికారం వస్తే రేవంత్‌రెడ్డే హీరో. పార్టీలోని మెజార్టీ సీనియర్లకు ఇది మింగుడుపడని విషయం.
అందుకే, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్నుంచి మొదలుకుని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, వీహెచ్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ వంటి నాయకులు రేవంత్‌ను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా రచ్చకెక్కుతున్నారు. తెలంగాణలో అత్యధిక కాలం పీసీసీ బాధ్యతలు నిర్వర్తించిన ఉత్తమ్ హయాంలో 12 మంది కాంగ్రెస్ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీనిని ఇప్పటికీ ఉత్తమ్ ఫెయిల్యూర్‌గానే చెబుతారు.ఇలాంటి సమయంలో రేవంత్ నాయకత్వంలో పార్టీ విజయం సాధిస్తే సీనియర్లకు దాదాపుగా బ్రేక్ పడినట్టే. సీఎం కుర్చీకి ముందు వరుసలో ఆయనే ఉంటాడనేది నిజం. అందుకే వ్యతిరేక స్వరాలు పెంచుతున్నారు. నిరసనకారుల వెనుక సీనియర్లు, ఎమ్మెల్యేలు ఉన్నారనే అంటున్నారు.
ఆయన తీరూ అంతే
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కూడా వైఫల్యాల బాటలోనే ఉన్నారు. అందరినీ కలుపుకుపోవడంలో సక్సెస్ కావడం లేదు. కనీసం వారిని బుజ్జగించడంలోనూ విఫలమవుతున్నారు. నేతలందరినీ పార్టీ కోసం పని చేయాలనే కోణంలోకి తీసుకురావడం లేదు. నేతలతో మాటాముచ్చట పెట్టి 'ముందుగా పార్టీని అధికారంలోకి తీసుకువద్దాం, ఆ తర్వాత కుర్చీల కొట్లాట అనో, అధిష్టానం ఎలా చెప్పితే అలా చేద్దాం' అనే దృఢమైన హామీనో ఇవ్వడం లేదు. ఎప్పుడో ఓసారి దీనిపై మాట్లాడుతున్నా దాన్ని పార్టీ నేతలు నమ్మడం లేదు.
సెగ్మెంట్లు డిస్టర్భ్
నియోజకవర్గాలు డిస్టర్బ్ అవుతున్నాయి. ఇప్పటిదాకా పార్టీని, సెగ్మెంట్‌ను అంటిపెట్టుకున్న పాత నేతలు డైలమాలో పడ్డారు. దీనికి ప్రధాన కారణం కూడా రేవంత్ అనేసీనియర్లు భావిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఖైరతాబాద్కుఇప్పటి దాకా ఏఐసీసీ నేత దాసోజు శ్రవణ్ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇక్కడ తానే పోటీదారుడినంటూ రేవంత్సమీప బంధువు రోహన్‌రెడ్డి ఓ వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇదే సమయంలో పీజేఆర్ కూతురు విజయారెడ్డి పార్టీలోకి వచ్చారు.
ఆమె మరో టీమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు.దీంతో శ్రవణ్వర్గం గందరగోళానికి గురవుతోంది. జడ్చర్ల టికెట్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్పట్టుబట్టి ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్లోకితీసుకువచ్చారు. అక్కడ ఇప్పటికే మల్లు రవి కర్ఛీప్వేశారు. తాజాగా అనురుధ్‌రెడ్డి పేరును కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెర పైకి తెచ్చారు. హుస్నాబాద్లోనూఇలాంటి పరిస్థితే. ఇప్పటి వరకు బొమ్మ శ్రీరాంచక్రవర్తి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ నుంచి ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా ఆయనే మీదేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ వదిలిన మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. దీంతో శ్రీరాంచక్రవర్తి అయోమయంలో పడిపోయారు. ఇలా చాలా సెగ్మెంట్లు వర్గాల వలన డిస్టర్బ్ అవుతున్నాయి.
కేసీఆర్ 'టినా' బీజేపీ పరుగు
వ్యూహాత్మకంగా వ్యవహరించి కేసీఆర్ 'టినా' (THERE iS NO ALTERNATIVE) ఫ్యాక్టర్ సృష్టించుకోగలిగారు. ప్రత్యామ్నాయం లేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్‌ను బలోపేతం చేసుకున్నారు. బలమైన నాయకత్వం తెలంగాణను శాసిస్తోంది. కేసీఆర్ తిరుగులేని నేతగా ఉన్నారు. కేటీఆర్, హరీశ్, కవిత, సంతోష్ వంటి కుటుంబ సభ్యులు ద్వితీయశ్రేణిలో ఉన్నారు. పార్టీని నమ్ముకుని తొలి నుంచి పని చేసినవారు, టీడీపీ నుంచి వచ్చిన తుమ్మల, కడియం వంటి సీనియర్ నేతలు తృతీయశ్రేణిలో సర్దుకుపోయారు. మిగిలిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం నాలుగో వరసకే పరిమితమవుతోంది. అయినప్పటికీ పార్టీలో విభేదాలు పెద్దగా బయటకు రావడం లేదు. కేసీఆర్‌కు భయపడో, లేక టిక్కెట్టు రాదనే జంకుతోనో అసమ్మతి కట్టు దాటడం లేదు. ఇప్పుడు పరిస్థితి కొంత మారిందనే అభిప్రాయాలున్నాయి. కేసీఆర్ సొంత సర్వేలలోనే వ్యతిరేకత బయటపడిందని తెలుస్తోంది. ఒకప్పుడు పల్లెలకు తెలియని కమలం గుర్తు ఇప్పుడు మారుమూల గ్రామాల తలుపు తడుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒకటే అనే ప్రచారం ఉంది. అయినా, తెలంగాణలో ప్రత్యామ్నాయం తామే అనిపించుకునేందుకు బీజేపీ తహతహలాడుతోంది.
వింటే బాగుపడతారు
దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ తిరుగుబాటుదారులే. పార్టీని ముందుకెళ్లకుండా పగ్గాలు వేసి మరీ వెనక్కి లాగుతున్నారు. దీనిని బీజేపీ అవకాశంగా తీసుకుంటోంది. గతంలో బీజేపీ నిరసనకు పిలుపునిస్తే పట్టించుకోని అధికార పక్షం ఇప్పుడు చిన్న చప్పుడు వినిపించినా కాషాయ నేతల ఇండ్ల ముందు పోలీసు బలగాలను మోహరిస్తోంది. ఇలా కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్యుపై చేసుకునేలా ఉంది. కాంగ్రెస్ నేతలకు ఇదంతా తెలిసినా 'వెనక్కి తగ్గేదేలే' అనే డైలాగును కొనసాగిస్తున్నారు. చివరగా పార్టీకి చెందిన ఒక కార్యకర్త అభిప్రాయం చెప్పి ముగిస్తాను. 'మా సెగ్మెంట్‌లో కాంగ్రెస్ బలంగానే ఉంది. కానీ, ఇద్దరు, ముగ్గురు నేతలు ఎవరి కుంపటి వారే పెట్టారు. గతంలో నుంచి జెండా ఎత్తుకుని తిరిగిన వారు ఆశలలో ఉంటే, ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వారు తామే అభ్యర్థులం అంటున్నారు. అందుకే, కాంగ్రెస్‌పరిస్థితి మంచిగనే ఉన్నా మళ్లా టీఆర్ఎస్సేగెలిచేలా ఉంది' అంటున్నాయన. హస్తం నేతలూ వింటున్నారా!!!
టి. సంపత్
94414 06811