- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మృత ఉద్యోగి కుటుంబానికి రుణాల విముక్తి
ప్రభుత్వ సర్వీసులో ఉండి మృతి చెందిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అన్ని రకాల రుణాలు, వాటిపై విధించే వడ్డీ రద్దు మాఫీ చేయు నిబంధనల ఉత్తర్వులను దాదాపు మూడు దశాబ్దాల క్రితమే ప్రభుత్వం జారీ చేసింది. కానీ వీటి గురించి చాలా మందికి సరైన అవగాహన లేక ఈ ఆర్థిక వెసులుబాటును ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉపయోగించుకోలేక పోతున్నారు. ఈ ఉత్తర్వులు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు జారీ చేశారు. గృహాల కొనుగోలు, వాటి నిర్మాణం, వాహ నాల కొనుగోలు, పెళ్లిళ్లు, పండుగల సందర్భంగా తీసుకున్న రుణాలు, అడ్వాన్సులపై విధించే వడ్డీతో పాటు ఆ సదరు అడ్వాన్సులను రుణాలను రద్దు పరిచేందుకు వివిధ రకాల ఉత్తర్వులను కాలాను గుణంగా ప్రభుత్వం వెలువరించింది.
కల్పించే వెసులుబాట్లు..
ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 171 ఆర్థిక, ప్రణాళిక శాఖ తేదీ 4.7.75 ననుసరించి ఇంటి నిర్మాణం, ఇంటి కొనుగోలు, పెండ్లి మొదలగు వాటికి సంబంధించిన రుణాలపై పండుగ అడ్వాన్సులు వాటిపై వడ్డీ మాఫీ చేస్తారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 401 ఆర్థిక, ప్రణాళిక శాఖ తేదీ 14.11.90 ప్రకారం గృహ నిర్మాణ మరమ్మతులకు అదనంగా పొందిన రుణాన్ని వడ్డీని రద్దు చేసేందుకు వీలు కల్పించారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 167 ఆర్థిక, ప్రణాళిక శాఖ తేదీ 4.10.99 అనుసరించి కారు, మోటార్ సైకిల్, మోపేడ్, పర్సనల్ కంప్యూటర్ మొదలైన వస్తువుల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై వడ్డీని మాత్రమే రద్దు చేసేందుకు అనుమతిని ఇచ్చారు, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 154 ఆర్థిక, ప్రణాళిక శాఖ తేదీ 2.9.2000 ప్రకారం కారు మోటార్ సైకిల్ రుణాలు వాటిపై వడ్డీని రద్దు చేయాలని పేర్కొన్నారు. పై విధంగా ప్రభుత్వ రుణాలు, వాటిపై విధించే వడ్డీని రద్దు పరిచేందుకు వివిధ ఉత్తరాలను వెలువరించి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
-సి మనోహర్ రావు,
రిటైర్డ్ ప్రభుత్వ అధికారి.
85198 62204