అత్యుత్తమ నివాస నగరమిదే

by Ravi |   ( Updated:2022-09-03 16:27:10.0  )
అత్యుత్తమ నివాస నగరమిదే
X

అత్యున్నత నివాసయోగ్యత కలిగిన పది స్థానాలలో ఆరు స్థానాలు యూరప్‌‌వి మాత్రమే కావడం విశేషం. గత ఏడాదితో పోల్చితే ఫ్రాక్‌ఫర్ట్‌ స్థానం 39 నుంచి 7కు, హామ్స్‌బర్గ్‌ 47 నుంచి 16కు, డుసెల్డోర్ఫ్‌ 50 నుంచి 22వ స్థానానికి ఎదగడం గమనించారు. నివాసయోగ్యతలో భారత నగరాలు తొలి పది స్థానాలలో స్థానం దక్కించుకోకపోవడం కొంత విచారకరమే అయినా, జాబితాలో చిట్టచివరన లేకపోవడం కొంత ఊరటను ఇస్తున్నది. కరోనా నిబంధనలతో పాటు నగరాల జీవన వ్యయాలు కూడా నివాస‌యోగ్యతలను ప్రభావితం చేసిందని నివేదిక స్పష్టం చేసింది.

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ (ఈఐయూ)' తాజాగా 'గ్లోబల్‌ లివబులిటీ ఇండెక్స్‌ (ప్రపంచ నివాసయోగ్య సూచిక)-2022'ను విడుదల చేసింది. దీని ప్రకారం ఆస్ట్రియా రాజధాని వియన్నా విశ్వ నగరాలలో అత్యత్తమ నివాసయోగ్యమైనదిగా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. కరోనా కారణంగా మూతపడిన మ్యూజియమ్స్‌, రెస్టారెంట్ల కారణంగా 2021 సూచికలో 12వ స్థానంలో నిలిచిన వియన్నా నేడు తొలి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం విశేషం. ఈఐయూ ప్రపంచవ్యాప్తంగా 173 నగరాలను అధ్యయనం చేసింది.

2022 ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 వరకు ఆయా నగరాల సంస్కృతులు, విద్యా వసతులు, వైద్య ఆరోగ్య వసతులు, రాజకీయ స్థిరత్వం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వనరులు అనే ఆరు అంశాలను పరిశీలించింది. నగరాల నివాసయోగ్యతలను 100 పాయింట్ల స్కేల్‌తో నిర్ణయించింది.

కరోనా కారణంగా

అత్యుత్తమ నివాసయోగ్యత గల ప్రపంచ నగరాలలో తొలి పది స్థానాలలో ఆస్ట్రియా 99.1 మార్కులు, డెన్మార్క్ 98.0 మార్కులతో తొలి రెండు స్థానాలు పొందాయి. ఆ తర్వాతి స్థానాలలో వరుసగా జూరిచ్, కల్గరీ, వాన్కోవర్, జెనీవా, ఫ్రాక్‌ఫర్ట్, టొరంటో, అమ్‌స్టర్‌డామ్, ఓసా, మెల్‌బోర్న్ నగరాలు నిలిచాయి. అలాగే చివరి పది స్థానాలు టెహ్రానా, డౌలా, హరారే, ఢాకా, ఫోర్ట్, మోర్బ్‌సీ, కరాచీ, అల్జియర్స్, ట్రిపోలీ, లాగోస్, డమాస్కస్‌కు లభించాయి. యుద్ధాలు, సంఘర్షణలు, తీవ్రవాదం, విపత్తులు నివాస యోగ్యతకు ప్రతికూలతగా మారాయి. కరోనా కారణంగా గత ఏడాది 60న స్థానంలో ఉన్న లండన్‌ (యూకే) నేడు 33వ స్థానానికి, లాస్‌ వేగాస్‌ (యూఎస్‌) 18 నుండి 37వ స్థానానికి, వెల్లింగ్టన్‌ 4 నుంచి 50వ స్థానానికి, ఆక్లాండ్‌ తొలి స్థానం నుంచి 34వ స్థానానికి, అడిలైడ్‌ 2 నుంచి 30వ స్థానానికి, పెర్త్‌ 26 నుంచి 32కు, బ్రిస్బేన్‌ 17 నుంచి 27వ స్థానానికి దిగజారడం గమనించారు.

కెనడా నగరాలు తొలి పది స్థానాలలో చోటు దక్కించుకోగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నగరాలు జాబితాలో కిందకు చేరాయి. ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతున్న వేళ కీవ్‌ నగరానికి అధ్యయనం నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యున్నత నివాసయోగ్యత కలిగిన పది స్థానాలలో ఆరు స్థానాలు యూరప్‌‌వి మాత్రమే కావడం విశేషం. గత ఏడాదితో పోల్చితే ఫ్రాక్‌ఫర్ట్‌ స్థానం 39 నుంచి 7కు, హామ్స్‌బర్గ్‌ 47 నుంచి 16కు, డుసెల్డోర్ఫ్‌ 50 నుంచి 22వ స్థానానికి ఎదగడం గమనించారు. నివాసయోగ్యతలో భారత నగరాలు తొలి పది స్థానాలలో స్థానం దక్కించుకోకపోవడం కొంత విచారకరమే అయినా, జాబితాలో చిట్టచివరన లేకపోవడం కొంత ఊరటను ఇస్తున్నది. కరోనా నిబంధనలతో పాటు నగరాల జీవన వ్యయాలు కూడా నివాస‌యోగ్యతలను ప్రభావితం చేసిందని నివేదిక స్పష్టం చేసింది.

డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి

కరీంనగర్‌

9949700037

Advertisement

Next Story

Most Viewed