- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్ సంఖ్య తగ్గించాలంటే..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాఠశాల విద్యపై బడ్జెట్లో నిధుల కేటాయింపు గతం కంటే పెరిగాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు సంఖ్య గణనీయంగా పెరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించింది. స్టాఫ్ చొరవ, నిరంతర ప్రయత్నాల వల్ల పాఠశాల మానేయడం వంటి సమస్యలు కొంత మేరకు తగ్గుమొహం పట్టాయి. అయితే ముఖ్యంగా అణగారిన సమూహాలలో, ఎస్సీ, ఎస్టీ, బాలికలు, అంగవైకల్యమున్న విద్యార్థులలో ఈ డ్రాపౌట్స్ ప్రధాన సమస్యగా కొనసాగుతుంది. ఇందుకు ఇటీవల యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మెషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్‌ఈ) తెలంగాణ విద్యా విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ నుండి లభించిన నివేదికలలో డేటాను ఉపయోగించి పరిష్కారాలు సూచించాను.
బడి మానేయడానికి కారణాలు..
సామాజిక-ఆర్థిక అసమానతలు, దారి ద్ర్యం తెలంగాణ విద్య విభాగం 2023 నుండి వచ్చిన డేటా ప్రకారం రాష్ట్రంలో 29.4 శాతం మందికి ఆర్థిక సమస్యలే పాఠశాల మానేయడానికి ప్రధాన అవరోధంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో బడి మానేయడం సుమారు 35 శాతానికి చేరుకుంది. ఎస్సీ, ఎస్టీ సమూహాలు ప్రత్యేకంగా ఈ సమస్యలతో ప్రభావితమవుతాయి. ఇక సాంస్కృతిక ప్రమాణాలు తెలంగాణ మహిళా కమిషన్ 2022 నివేదిక ప్రకారం, అణగారిన సమూహాలకు చెందిన అమ్మాయిలలో 14.8 శాతం మంది మధ్యంతరంగా పాఠశాల విద్య పూర్తి చేయకముందే బడి మానేస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ డేటా ప్రకారం, అమ్మాయిలలో 30 శాతం మంది చిన్న వయసులో వివాహం, ఇంటి బాధ్యతలను కారణంగా మానేశారు. 12 శాతం మంది భద్రత, దూరాన్ని కారణంగా చూపించారు. ఇక 2022లో తెలంగాణ రాష్ట్ర విద్యా నివేదిక ప్రకారం, 42 శాతం గ్రామీణ పాఠశాలలు అమ్మాయుల పాఠశాలల్లో పనిచేసే శౌచాలయాలు కలిగి లేవని ఇందువల్ల 21.6 శాతం అమ్మాయిలు బడి మానేయడానికి కారణమవుతుందని తెలిపింది. అలాగే సుమారు 18 శాతం పాఠశాలల్లో అంగవైకల్యమున్న విద్యార్థుల కోసం పాఠశాలల్లో యాక్సెస్ ర్యాంపుల సదుపాయాలను కలిగి లేవని తద్వారా అంగవైకల్యమున్న విద్యార్థుల డ్రాపౌట్స్ 50 శాతం కంటే ఎక్కువయ్యాయని తెలిపింది.
తగిన ప్రమాణాలు లేని కారణంగా..
ఇక నేర్చుకునే విద్యలో లోటుపాట్లు అకడమిక్ సవాళ్లు ఒక రకంగా డ్రాపౌట్స్‌కి కారణమవుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. జాతీయ సాధన సర్వే 2021 ప్రకారం, తెలంగాణలో 5వ తరగతి నుండి 8వ తరగతుల్లో ఉన్న విద్యార్థులలో 39 శాతం మంది విద్యార్థులు గ్రేడ్‌కి తగిన ప్రమాణాలు కలిగిన చదువు లభిం చటం లేదని ముఖ్యంగా గణితం నైపుణ్యాలను కలిగి ఉండటం లేదని తెలి పింది. కొవిడ్-19 తరువాత అకడమిక్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల మధ్య డ్రాపౌట్ సంఖ్య 16 శాతం పెరిగిందని, ఇక గ్రామీణ తెలంగాణలో యూనిసెఫ్ 2021 నివేదిక ప్రకారం, గ్రామీణ విద్యార్థుల్లో 27 శాతం మంది లాక్‌డౌన్ తరువాత పాఠశాలకు తిరిగి రాలేదని పరిమిత డిజిటల్ యాక్సెస్ ఈ సవాళ్లను మరింత పెంచిందని తెలపింది. ఇక బడి మానేసిన ఎస్సీ, ఎస్టీ పిల్లల్లో 41 శాతం మంది అనధికార కార్మిక లేదా తక్కువ వేతన ఉద్యోగాలలో పనిచేస్తున్న వారు ఉన్నారు. 9 శాతం మాత్రమే తదుపరి వృత్తి లేదా నైపుణ్య ఆధారిత శిక్షణను కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల కారణంగా..
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్‌ల మూలంగా తెలంగాణలో బాల్య వివాహాల సంఖ్య తగ్గింది. డ్రాపౌట్ల రేట్లపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించింది. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల రేట్లను 12 శాతం తగ్గించడంలో సహాయపడింది. అయితే నిపుణులు దీన్ని అమ్మాయిలకు విద్యను కొనసాగించటానికి ప్రోత్సాహకంగా ఈ పథకాన్ని విస్తరించాల్సిందిగా సూచిస్తున్నారు. అలాగే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ విస్తరణ తరువాత ఒక లక్షకు పైగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు లాభం చేకూరింది. అయితే ఇది ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల చర్యలకు చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ పథకం ద్వారా 1200లలో మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పటికీ ఇంకా మారు మూల ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాలు మెరుగుపడాలి.
డ్రాపౌట్లను తగ్గించడానికి..
పాఠశాలల్లో డ్రాపౌట్లను తగ్గించేందుకు అణగారిన విద్యార్థులకు ఆర్థిక సహా యంగా ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను పెంచి సకాలంలో విద్యార్థులకు అందిం చాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను విస్తరించాలి. సామాజిక చైతన్యంతో విద్యార్థుల సంఖ్య నమోదు, రిటెన్షన్ మెరుగుపడుతుంది. ముఖ్యం గా అమ్మాయిల కోసం, తల్లిదండ్రులు, స్థానిక నాయకులను చేర్చే కార్యక్రమాలు డ్రాపౌట్ రేట్లను సుమారు 15 శాతం వరకు తగ్గించగలవని స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చీ అండ్ ట్రైనింగ్ తెలిపింది. విద్యా కార్యక్రమా లు, బ్రిడ్జ్ కోర్సులు, అకడమిక్ లోటుల ను పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ టెక్నాలజీకి యాక్సెస్‌ను మెరుగుపరచాలి. డ్రాపౌట్ సమస్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మౌలిక అంశాలతో ప్రభావితమై ఉంది. వీటిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ సంస్థలు కుటుంబాలు ఉమ్మడి ప్రయత్నం చేయటం అవసరం. సమగ్ర విద్యపై దృష్టి పెట్టడం ద్వారా తెలంగాణలో డ్రాపౌట్ల రేట్లను తగ్గించడానికి వీలవుతుంది.
దండెబోయిన అశోక్ యాదవ్,
గెజిటెడ్ హెడ్మాస్టర్
94405 21990
- Tags
- school dropouts