ఎన్నికల్లో.. ప్రజల పాత్ర శూన్యమే!

by Ravi |   ( Updated:2024-04-02 00:30:40.0  )
ఎన్నికల్లో.. ప్రజల పాత్ర శూన్యమే!
X

1951 నుంచి నేటి వరకు ప్రతి రాజకీయ పార్టీ కార్మికులకు కర్షకులకు, మహిళ అభ్యున్నతి, అణగారిన వర్గాలకు, ప్రయోజనాలు చేకూరుస్తామని వాగ్దానాలు, గ్యారెంటీలు ఇస్తున్నాయి. వాగ్దానాలతో పాటు నాయకుల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. పార్టీ టికెట్ రాని నాయకులు ప్రతిపక్ష పార్టీలోకి, పార్టీ టికెట్ ఇస్తే ప్రతి పక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి మారడం జరుగుతుంది. గతంలో నేరస్తులుగా చిత్రీకరించిన వారే తమ పార్టీలోకి చేరగానే పునీతులుగా భావిస్తున్నారు.

పార్టీ మార్పిడులు భావసారూప్యత ప్రకారం కానీ, సిద్ధాంత పరంగా కానీ జరగడం లేదు. కేవలం అధికారం కోసం మాత్రమే జరుగుతున్నాయి. పార్టీ మారిన తరువాత నాయకుల వ్యక్తిగత ప్రయోజనాలు, భావజాలం కుదరక కూటములు విచ్ఛిన్నం కావడం జరుగుతోంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రజల భాగస్వామ్యం ఉందని పాలకులను నిర్ణయించేది ప్రజలే అని ప్రచారం కావిస్తున్నారు. కానీ ఎన్నికల ప్రచారానికి కోట్లాది రూపాయలు కుమ్మరించడం, ఓటర్లను మభ్యపెట్టేందుకు మద్యం, డబ్బు పంపిణీ విచ్చలవిడిగా చేసి ఎన్నికల్లో గెలుస్తున్నారు. ఇలా గెలిచిన తర్వాత నాయకులు చేసిన హామీలను మరచిపోవడం తరచు చూస్తూనే ఉన్నాము. ప్రజాసేవ కోసం అంటూ రాజకీయాల్లోకి వచ్చి పారిశ్రామికవేత్తలు మరింత ధనికులుగా ఎదుగుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజల పాత్ర శూన్యం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

ఆళవందార్ వేణు మాధవ్

8686051752

Advertisement

Next Story

Most Viewed