సంస్కరణల దిశగా తెలంగాణ రాష్ట్ర జైళ్లు..

by Nagaya |
సంస్కరణల దిశగా తెలంగాణ రాష్ట్ర జైళ్లు..
X

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్న స్వరాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా తెలంగాణ జైళ్లు కూడా అభివృద్ధి చెందినాయి.. దేశంలోనే తెలంగాణ జైళ్ల శాఖకు మంచి పేరు ఉంది తెలంగాణ జైళ్ల శాఖ సంస్కరణలు అన్ని రాష్ట్రాల కంటే అగ్రగామిగా ఉన్నవి తెలంగాణ జైళ్ల శాఖ ఖైదీల సంక్షేమానికి చేపడుతున్న సంస్కరణలు ఎంతో సత్ఫలితాలు ఇచ్చి సాధిస్తున్న ప్రగతి ఫలాలు దేశంలోనే ప్రాచుర్యం పొంది మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తున్న తెలంగాణ జైళ్ల శాఖలో ఖైదీల సత్ప్రవర్తన లక్ష్యంగా చేపడుతున్న సంస్కరణలు ఉపాధి మరియు సంపద మీద దృష్టి అన్నిటికీ ఆదర్శం..

అన్ని జైల్లో నాణ్యమైన ఆహారం..

ఒకప్పుడు జైలు అంటే చిప్పకూడు అనుకునేవారు కానీ సాధించిన రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ జైలు జిల్లా జైలు కేంద్రకారాగారాలలో ఖైదీలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందిస్తున్నవి. కొన్ని జైళ్లు సొంతంగా సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు చర్లపల్లి లాంటి పెద్ద జైళ్లలో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి అన్ని రకాల వ్యవసాయ పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నారు దాదాపు అన్ని సబ్ జైల్లో మరియు జిల్లా జైల్లో కేంద్ర కారగారాలలో ఖైదీలకు పని కల్పిస్తున్నవి ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు పోతున్నారు. ప్రతి జైలుకి వైద్యుడు ఉంటారు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు అన్ని జైళ్ళకి అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్ లు కూడా ఉన్నవి ..

కరోనా సమయంలో కంటికి రెప్పలా కాపాడిన జైళ్ల శాఖ సిబ్బంది..

కరోనా మహమ్మారి దేశాన్ని ప్రపంచాన్ని వనికించింది అయినా రద్దీగా ఉన్న జైళ్లు మాత్రం కరోనా నుండి తమను కాపాడుకోవడంలో విజయం సాధించాయి. జైళ్ల శాఖ ఉన్నత అధికారులు మరియు సిబ్బంది ఎప్పటికీ అప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని అధికారుల సూచనలతో కరోనా మహమ్మారిని తరిమికొట్టినారు.. రాష్ట్ర జైళ్ల శాఖ తన సంస్థను కాపాడుకోవడంతోపాటు రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మాస్కులు శానిటైజర్లు అందించారు. ప్రతి జైల్లో ఉన్న ఖైదీలకు మాస్కులు శానిటైజర్లు ఇచ్చారు కరోనా సమయంలో జైళ్ల శాఖ సేవలు మర్చిపోలేనివి ఎన్నో ఉన్నాయి. ఖైదీల సంక్షేమం కూడా ఎక్కడ ఆగలేదు. ములఖాత్ ని ఆన్లైన్ ములఖ త్ ద్వారా కూడా సేవలు అందించారు. జైళ్ల శాఖ అధికారుల ఆలోచనలతో కష్ట కాలాన్ని కూడా జైళ్ల శాఖ సిబ్బంది ఖైదీలు తట్టుకొని నిలబడ్డారు కరోనా భారీ నుండి రక్షించుకోగలిగారు..

రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ జైలు సందర్శన..

ముఖ్యమంత్రి హోదాలో గౌరవ కేసీఆర్ గారు వరంగల్ జైలు ను సందర్శించి ఖైదీల యోగక్షేమాలు తెలుసుకొని వారితో ముచ్చటించారు మరియు చారిత్రాత్మకంగా నిర్ణయాలు తీసుకొని వరంగల్ సెంట్రల్ జైలు స్థలం ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ నిర్మాణం కోసం వరంగల్ సెంట్రల్ జైలుని మామునూరు కి తరలించి నూతన జైలుకు ప్రతిపాదనలు పంపారు జైళ్ల శాఖ అధికారులు ప్రజల ఆరోగ్యం మరియు నిరుపేదలకు వైద్యం కోసం ఆలోచన చేసి జైలు స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు ప్రభుత్వం మమునూరులో దాని కంటే ఎక్కువ స్థలాన్ని జైళ్ల శాఖకి కేటాయించింది..

ఆదాయ వనరులుగా జైళ్లు..

తెలంగాణ జైళ్ల శాఖ ఖైదీల సత్ప్రవర్తన మరియు సంస్కరణలతో పాటు వారికి ఉపాధి కల్పించడంలో ముందున్నాయి.. పరిశ్రమలు ఏర్పాటు చేసి వృత్తి విద్య నైపుణ్యం శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.. వ్యవసాయం ఫ్యాక్టరీలు మరియు పెట్రోల్ బంకులతో అధిక ఆదాయాన్ని సమకూర్చి అభివృద్ధి చేస్తున్నారు..

కొత్త జిల్లాలో సిద్దిపేటలోనే తొలి జైలుకు శంకుస్థాపన..

సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో 34 ఎకరాల్లో 78 కోట్లతో జిల్లా జైలు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభమైనవి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలలో ఏర్పాటు అవుతున్న మొదటి జైలు సిద్దిపేట జిల్లా జైలు ..

నర్సంపేటలో ప్రత్యేక మహిళ సబ్ జైలు...

మహిళ ఖైదీల కోసం నర్సంపేట లో ప్రత్యేక మహిళ సబ్ జైలు ని ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళ ఖైదీలకు ఎంతో దూర భారం తగ్గింది.. హైదరాబాద్ చంచల్ గూడ లో మహిళ ల కోసం ప్రత్యేక జైలు వుంది తర్వాత మహిళ ల కోసం ప్రత్యేక సబ్ జైలు నర్సంపేట లో ప్రారంభం చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి లో భాగంగా మహిళ ఖైదీల రక్షణ భద్రత కోసం ఇంకా కొన్ని ప్రత్యేక జైళ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి నిజామాబాదు సంగారెడ్డి జైళ్లలో ప్రత్యేక మహిళ కారాగారాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది..

కేంద్రకారాగారాలుగా సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా జైళ్లు..

నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా జైళ్లు కేంద్ర కారాగారాలుగా మార్పుతో క్రమంగా ఖైదీల సంఖ్య పెరిగింది రెండేళ్లు ఆపై శిక్ష పడిన ఖైదీలను ఈ జైళ్ల లోనే ఉంచుతున్నారు అందుకు అనుగుణంగా వసతులు ప్రత్యేక బ్యారకులు ఏర్పాటు చేశారు త్వరలో కూడా అదనపు సిబ్బందిని కూడా కేటాయించనున్నారు. మరోవైపు కేంద్రకారాగాలుగా మార్చడంతో పోలీసులకు ఎస్కార్ట్ భారం కూడా తప్పింది. సంగారెడ్డి నిజామాబాద్ జైళ్లు కేంద్రకారగారాలుగా అప్ గ్రేట్ అయిన తర్వాత అందుకు సరిపడా సిబ్బందిని నియమించాల్సి ఉంది అది ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది ఈ ప్రక్రియ కూడా అతి త్వరలోనే పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి కేంద్రకారగారాలకు అవసరము అయ్యే నిర్మాణాలు కూడా ఈ జైళ్ల లో చేపట్టనున్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా తెలంగాణ జైళ్ల శాఖను అభివృద్ధి చేస్తుంది సాధించిన రాష్ట్రంలో జైళ్లు కూడా అభివృద్ధి చెందడం చాలా సంతోషకర విషయం రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి అవుతుంది ఉద్యమ సమయంలో అక్రమ కేసులతో తెలంగాణ ఉద్యమకారులు ఎక్కువ సంఖ్యలో జైల్లోకి పోయిన వారే కాబట్టి అధికారులు తెలంగాణ జైళ్ల శాఖ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు..సాధించుకున్న స్వరాష్ట్రం లో తెలంగాణ జైళ్ల శాఖ లో ఉద్యోగ నియామకాలు కూడ భారీగా భర్తీ చేశారు..

(అక్టోబర్ 2 ఖైదీల సంక్షేమ దినోత్సవం..)

-ముచ్కుర్ సుమన్ గౌడ్

Advertisement

Next Story