- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ షర్మిల రాజకీయ కామెంట్ల వెనుక కథ ఇదేనా?
మహిళ అనే గౌరవంతో ఆమె తెలంగాణ పర్యటనకూ, ప్రసంగాలకూ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ ఎక్కడా అడ్డు చెప్పలేదు. తెలంగాణకు బద్ధ శత్రువు అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు జగన్‌ను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఏనాడూ వ్యతిరేకులుగా పరిగణించలేదు. ఢిల్లీ పర్యటన తర్వాత ఒక్కసారిగా షర్మిల స్వరం మారింది. పచ్చటి తెలంగాణాలో నిప్పులు పోసే ప్రయత్నం చేస్తున్నది. అప్ఘానిస్తాన్, పాకిస్తాన్‌తో పోలుస్తూ ఉద్యమ నేతలను తాలిబన్‌లుగా వర్ణిస్తున్నది. ఉద్యమ స్ఫూర్తి ఉన్న గడ్డ మీద నీ అన్న జగన్‌కు భయమంటే ఏమిటో చూపిన మానుకోట ఇంకా గాయాల నుంచి కోలుకోకముందే, వైఎస్సార్ తనయ నోటికొచ్చినట్టుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే రోషం ఉన్న జనం చూస్తూ ఊరుకుంటారా? విద్వేషపూరిత ప్రసంగాలను ఇక్కడి జనం జీర్ణించుకోలేరనేది తెలియదా? అందుకే నర్సంపేట గడ్డ 'గో బ్యాక్ షర్మిలా' అని నినదించింది.
హరితనిలయంగా ఉన్న రాష్ట్రంలో గుణ సంపదను, జ్ఞాన సంపదను కొల్లగొట్టడం కోసం, ఫ్యాక్షన్ రాజకీయాలకు పురుడు పోయడం కోసం షర్మిల ప్రయత్నం చేస్తున్నదని అవగతమవుతున్నది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ కేసులు, కుటుంబ తగాదాలను పావుగా వాడుకునేందుకు, బౌద్ధాన్ని బయట నుంచి, లోపల నుంచి వెన్నుపోటు పొడిచేందుకు, విధ్వంసాలు సృష్టించేందుకు బీజేపీ(bjp) ఆమెను అక్కున చేర్చుకున్నది. బక్క పలుచని ఉద్యమ నేత కేసీఆర్‌ను(kcr) ఓడించేందుకు, ముస్సోలినీ నాయకత్వంలో బయలుదేరిన నిరాపేక్ష రాజ్యాధికార సిద్ధాంతాన్ని నమ్ముకొని అన్ని అస్త్రాలను ప్రయోగించి బొక్క బోర్లా పడింది. చైతన్య పూరిత తెలంగాణ గడ్డ మీద లక్ష్యం నెరవేరలేదు. ఆశ చావలేదు.
ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. కులం పేరుతో, మతం పేరుతో ఎన్నయినా పెట్టుకోవచ్చు. అందులో భాగంగా వైఎస్ తనయ పార్టీ స్థాపించింది. ఎనుకటికి పాండవులు జూదంలో సర్వస్వం కోల్పోయి తపస్సు కోసం వచ్చినట్టుగా పుట్టినగడ్డలో పుట్టగతులుండవని 'తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని, వైఎస్సార్ వలె నీతివంతమైన పాలన అందిస్తానని' సత్యహరిశ్చంద్రుడి వలె షర్మిల(ys sharmila) ప్రవచనాలు చెబుతున్నారు. జగనన్న విడిచిన, కమలం వదిలిన బాణం షర్మిల అనేది ఆలస్యంగానైనా తేటతెల్లమవుతున్నది.
దిగజారిన వ్యాఖ్యలు
కేసీఆర్ సుదూర దృష్టితో బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత షర్మిల దిగజారిపోయి చేస్తున్న వ్యక్తిగత దూషణలు, వ్యాఖ్యలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. యేడాదికి పైగా తెలంగాణలో 3,500 కిలోమీటర్ల యాత్ర విజయవంతం కావడానికి కారణం ఏమిటి? మహిళ అనే గౌరవంతో ఆమె తెలంగాణ పర్యటనకూ, ప్రసంగాలకూ ప్రభుత్వం, టీఆర్‌ఎస్(trs) ఎక్కడా అడ్డు చెప్పలేదు. తెలంగాణకు బద్ధ శత్రువు అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి(ys rajashekar reddy), ఆయన కుమారుడు జగన్‌ను(ys jagan) రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ(telangana governament) ప్రభుత్వం ఏనాడూ వ్యతిరేకులుగా పరిగణించలేదు. ఢిల్లీ పర్యటన తర్వాత ఒక్కసారిగా షర్మిల(ysrtp party cheif) స్వరం మారింది.
పచ్చటి తెలంగాణాలో నిప్పులు పొసే ప్రయత్నం చేస్తున్నది. అప్ఘానిస్తాన్ , పాకిస్తాన్‌తో పోలుస్తూ ఉద్యమ నేతలను తాలిబన్‌లుగా వర్ణిస్తున్నది. ఉద్యమ స్ఫూర్తి ఉన్న గడ్డ మీద నీ అన్న జగన్‌కు భయమంటే ఏమిటో చూపిన మానుకోట(manukota incident) ఇంకా గాయాల నుంచి కోలుకోకముందే, వైఎస్సార్ తనయ నోటికొచ్చినట్టుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే రోషం ఉన్న జనం చూస్తూ ఊరుకుంటారా? విద్వేషపూరిత ప్రసంగాలను ఇక్కడి జనం జీర్ణించుకోలేరనేది తెలియదా? అందుకే నర్సంపేట గడ్డ 'గో బ్యాక్ షర్మిలా' అని నినదించింది. మరునాడే షర్మిల రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నానా హంగామా సృష్టించింది. పోలీసులు అలా అరెస్టు చేశారో లేదో, వెంటనే రాజ్ భవన్(raj bhavan) రంగంలోకి దిగిందనేది జగద్విదితం.
Also read: చంద్రబాబు, షర్మిల కలిసి లాభం చేకూర్చేది కేసీఆర్ కేనా..?
వనరులను దోచుకుంటూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీఎంగా తెలంగాణలో ఉన్న వనరులు దోచుకుపోయారు. ఆయన కొడుకు ఏపీ సీఎంగా ఇప్పుడు జగన్(ap cheif minister) దోచుకునేందుకు యత్నిస్తున్నారు. సీమాంధ్ర గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఆత్మగౌరవంతో ముందుకు సాగుతున్న రాజకీయ అవసరాల కోసం తిరిగి తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితులలోనూ సహించదు. నమ్మక ద్రోహం, ఫ్యాక్షనిజం, గుండాయిజం మీ రక్తంలోనే ఉన్నది. నక్సలైట్లను చర్చల పేరుతొ పిలిచి పొట్టన పెట్టుకున్న ఒక నరరూప రాక్షసుడి తనయుడు జగన్, తనయ షర్మిల. తెలంగాణకు మంచి చేస్తారని ఎలా అనుకుంటాం? రేగు చెట్టు పెడితే తులసి మొక్క ఎలా పుడుతుంది?
2019లో జరిగిన బాబాయి హత్య సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారనే కారణాలతో వివేకానంద రెడ్డి(ys vivekananda reddy) హత్య కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సీబీఐ(cbi) కోర్టుకు మార్చేందుకు ఎవరు కారణం? బాబాయి కూతురు సునీతకు న్యాయం ఎందుకు చేయలేదు? కేసును ఎందుకు ఛేదించలేదు? వైఎస్ కుటుంబం(ys family) ఆస్తుల తగాదాలలో చిక్కుకున్నది. వారసత్వం కోసం రాజకీయ వైరం ఏర్పడింది. అసలే జగనన్న రక్తచరిత్ర గురించి బాగా తెల్సిన సోదరి కదా? కేంద్ర ప్రభుత్వం(central governament) అండదండలతో అన్నను గెలవాలని, వైఎస్ షర్మిల తెలంగాణలో కవ్వింపు రాజకీయాలు చేయాలని భావిస్తున్నట్టున్నారు. అందుకే ఆమె వ్యవహారశైలి రోజురోజుకూ వివాదాస్పదమవుతున్నది.
ఆనాడు జైలు జీవితం గడపలేదా?
తెలంగాణలో అడ్డదారిన అధికారం చేపట్టడానికి, రాజన్న బిడ్డను సీబీఐ కేసు నుంచి తప్పించడానికి, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ కోసం కోటి ఎకరాల మాగాణికి నీళ్లు అందించి సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సీబీఐకి ఫిర్యాదు చేసినా తీరు 'దొంగే ..దొంగ' అన్నట్లుగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కబ్జాలు, అక్రమాలు చేసి లక్ష కోట్ల అవినీతి ఆరోపణతో జగన్(ysrcp cheif) జైలు జీవితం గడిపింది నిజం కాదా?
ఫ్యాక్షన్, రక్తచరిత్రకు మారుపేరు అయిన వైఎస్ రాజారెడ్డి(ys rajareddy) కుటుంబంలో బాబాయి హత్య తర్వాత జరిగిన పరిణామాలు, కొంత కాలంగా అన్నతో విభేదించి 'బతికుంటే బలుసాకుకూర తిని బతుకొచ్చు' ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంత మంచివి కావు, ఫ్యాక్షన్ నమ్ముకొని రాజకీయాలు చేసే అన్న చేతిలో ఆగం కావొద్దని, మెట్టినిల్లు పేరుతో హాయిగా పార్టీ పెట్టి పబ్బం గడుపుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో రాని మైలేజీతో వ్యక్తిగత దూషణలకు దిగి అభాసుపాలవుతున్నారు. పిట్ట బెదిరింపులకు దిగడం విడ్డూరంగా ఉంది. వైఎస్సార్ సీఎం కాకముందు స్కూటీ మీద తిరిగిన షర్మిలకు పెట్టుబడి ఎవరు పెడుతున్నారో? ఎవరు నడిపిస్తున్నారో? తెలంగాణ ప్రజానీకం గమనిస్తూనే ఉంది. 'నోటిలో చక్కెర పోసి కడుపులో కత్తులు గుచ్చినట్టు' ఏపీ పాలకుల తీరు ఉంది. రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రుల తీరు మారలేదు. అరాచకం చేస్తే, తెలంగాణ ఆడ బిడ్డలు రాష్ట్ర పొలిమేర వరకు తరమడం తప్పదేమో!?
డా. సంగని మల్లేశ్వర్
కేయూ జర్నలిజం విభాగాధిపతి
వరంగల్, 98662 55355