- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వికసిత భారత్‌కి గట్టి పునాదులు
దేశంలో నిష్క్రియాతత్వ పాలన, అవినీతి, బంధుప్రీతి, సంతుష్టీకరణ రాజకీయాలకు విసుగు చెందిన భారత ప్రజలు 2014వ సంవత్సరంలో నరేంద్ర మోడీకి బలమైన మద్దతును ప్రకటించి దేశ ప్రధానిగా బాధ్యతలు అప్పగించారు. అప్పటినుండి ఆయన ప్రధానమంత్రిగా కాకుండా దేశ ప్రజలకు ప్రధాన సేవక్‌గా సేవలు అందిస్తూ సరైన సమయంలో వేగవంతమైన నిర్ణయాలతో పాటు సంస్కరణలతో కూడిన విధానపర నిర్ణయాలను తీసుకుంటూ 2047లో వికసిత భారతంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి శ్రమిస్తున్నారు.
ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల దేశ ప్రజలకే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు దక్కా యి. మూడవ ఎన్నికల సమయంలోనే ఈ సారి అధికారంలోకి వస్తే తొలి వంద రోజులలో దేశ క్షేమం కోసం ఏమి చేయాలో అని చర్చించి నిర్ణ యం తీసుకున్న మోడీ ఆ దిశలోనే వేగంగా అడు గులు వేస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీతో పా టు దాని మిత్రపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టి స్తూ అసంబద్ధ ప్రకటనలు, అసత్య ప్రచారాలు నెరవేర్చలేని హామీలు ఇచ్చినప్పటికీ దేశ సౌభా గ్యం కోసం సంక్షేమాన్ని సమ్మిళిత అభివృద్ధిని సరైన మేళవింపుతో ముందుకు తీసుకువెళుతున్నారు.
ప్రతిపక్షాల వైఖరికి భిన్నంగా..
మోడీ దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి అగ్ర తాంబూలం ఇస్తున్నారు. 15 లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి.. వివిధ పథకాల అమలు కోసం తొలి వంద రోజులలోనే ఆమోదం తెలపడం ఆ దిశగా పనులు ప్రారంభించడం ప్రశంసనీయం. దేశంలో ప్రధానమంత్రి ఆయు ష్మాన్ భారత్ ద్వారా ప్రతి భారతీయునికి ఆరోగ్య భద్రత కల్పిస్తూ వస్తున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్‌కు కూడా 5 లక్షల రూపాయల వరకు ఈ పథకంలో ఉచిత వైద్యాన్ని అందిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్షాలు ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ ప్రయోజనాల కోసం, దేశ ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో ఇష్టారీతిగా హామీలు ఇస్తున్నాయి. ఆ వైఖరికి భిన్నంగా ఉద్యోగ సంఘాలతో సంబంధిత ప్రతినిధులతో చర్చించి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)కు ఆమోదం తెలిపి అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని మరోసారి చూపెట్టింది. గత దశాబ్దకాలంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా నాలుగు కోట్ల ఇండ్లను నిర్మించిన మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారం చేపట్టాక మరో మూడు కోట్ల ఇండ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నది. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ అందించడానికి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి వంద రోజుల్లోనే 2.5 లక్షల ఇళ్లలో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసింది.
మౌలిక వసతుల కల్పన కోసం..
దేశంలో నూతన ఆవిష్కరణల కోసం లక్ష కోట్ల రూపాయలతో పరిశోధన నిధిని ఏర్పాటు చేయడం, 8 జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా 65,000 కిలోమీటర్ల మేర రోడ్లు వంతెనల నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం, దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లను పెంచడంతో పాటు 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం, వ్యవసాయ రంగంలో కొత్త స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి అగ్రి సూర్ అనే కొత్త నిధిని ఏర్పాటు చేయడం, లడఖ్‌ను హిమాచల్‌ప్రదేశ్‌తో కలిపే షింఖున్-లా టన్నెల్ నిర్మాణంను ప్రారంభించడం, వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, బీహార్‌లోని బిహ్తా, పశ్చిమ బెంగాల్ లోని బాగ్‌డోగ్రాలో కొత్త సివిల్ ఎన్‌క్లేవ్‌ల అభివృద్ధికి ఆమోదం తెలపడం, లక్షద్వీప్ దీవుల్లోని అగట్టి, మినీకాయ్‌లో కొత్త ఎయిర్‌స్ట్రిప్‌ల నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం గమనిస్తే.. మౌలిక వసతుల కల్పనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత వేగంగా అడుగులు వేస్తుందో స్పష్టం అవుతుంది. వీటితోపాటు నారీ శక్తిని ప్రోత్సహించడానికి మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రణాళికలు రచించడం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మరో విడత పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించడం, రైతుల నుండి పంటల సేకరణ కోసం కనీస మద్దతు ధరను విస్తరించడం, అంతర్జాతీయ ఒత్తిడిలను తట్టుకొని రైతులకు ఎరువుల సబ్సిడీని అందించడంతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం ప్రోత్సాహకాలు విడుదల చేస్తూ ఉండడం నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వస్పర్శి విధానాలకు నిదర్శనం.
తెలంగాణ అభివృద్ధి కోసం..
దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో అద్భుత నిర్ణయాలు తొలి వంద రోజులలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడంతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక నిర్ణయాలను అమలు చేస్తుంది. జహీరాబాద్‌లో 22,361 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటును ప్రకటించింది. హైదరాబాద్ నుండి నాగపూర్ వరకు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సౌకర్యాన్ని కల్పించడంతో తెలంగాణ నుండి మొత్తంగా వందే భారత్ సర్వీసులు 5కు పెరిగాయి. సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అందించడంతో రాష్ట్రంలో ప్రజలకు కావలసిన సౌకర్యాల అభివృద్ధికి ఇది కీలక పరిణామంగా మారింది. రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా రైల్వేస్టేషన్లో అభివృద్ధి, రైల్వే లైన్ల ఆధునీకరణ, వివిధీకరణ వేగంగా జరుగుతుంది. దీనిలో భాగంగానే 4109 కోట్లతో భద్రాచలం నుండి మల్కాజ్‌గిరి వరకు నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దేశ సంక్షేమమే లక్ష్యంగా..
దేశ అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సంబంధాలను, అంతర్జాతీయ దౌత్యనీతిని నరేంద్ర మోడీ అత్యంత చాకచక్యంగా పాటిస్తున్నారు. భారత దేశాన్ని శత్రు దేశాలు కూడా పొగిడేలా... అంతర్జాతీయ విపత్తు సమయాలలో భారతదేశం కీలక పాత్ర పోషించేలా రష్యా- ఉక్రెయిన్ లాంటి భీకర యుద్ధ సమయంలో కూడా వారికి శాంతి మంత్రా న్ని బోధించే మహాశక్తిగా భారతదేశాన్ని తీర్చి దిద్దారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల నుండి మొదలుకొని జీ7, జీ20 సమావేశాల వరకు ప్రతి సమావేశాలలో భారతదేశం ప్రతి అంశం పట్ల బలంగా తన వైఖరిని వెళ్లబుచ్చడం మారిన భారత దౌత్య విధానాలకు నిదర్శనం. ప్రపంచంలో ఏ మూలన భారతీయుడు ఆపదలో ఉన్నా, వారిని సురక్షితంగా దేశంలోకి చేర్చే బాధ్యతను స్వీకరించిన మోడీ ప్రభుత్వం దాన్ని విజయవంతంగా అమలు చేయడంతో పాటు సమీప దేశాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సునిశితంగా గమనిస్తూ భారతదేశ సంక్షేమం భద్రత లక్ష్యంగా పటిష్టమైన నిర్ణయాలను వేగంగా అమలు చేయడం ప్రభుత్వ దార్శనికతకు ప్రతీక. 2047వ సంవత్సరం వరకు వికసిత భారతం దిశలో ముందుకు సాగుతామని దేశ ప్రజలకు వాగ్దానం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ తొలి వంద రోజులలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఆ స్వప్నం చాలా వేగంగా సాకారం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తూళ్ల వీరేందర్ గౌడ్
అధికార ప్రతినిధి, బీజేపీ తెలంగాణ