- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్రం వారి విధానాలు మన మీద రుద్దుతుందా?
భారతదేశంలో భిన్న మతాలు, భాషలు, భిన్న సంస్కృతులు ఉండి భిన్నత్వంలో ఏకత్వానికి నిలయంగా ఉంది. వాటిని పరిరక్షిస్తామని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ విలువలను, స్ఫూర్తిని, ప్రజాస్వామిక, లౌకిక దృక్పథానికి విఘాతం కలిగించేలా పాలనా విధానాలు కొనసాగించడం దురదృష్టకరం. ప్రస్తుతం దేశంలో హిందీ భాషను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినా చాపకింద నీరులా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే హిందీలోకి తర్జూమా చేసిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సెలబస్‌ను గత నెల 16 న హోమ్ మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
వారి భావజాలం రుద్దేలా
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ది 'ఒకే దేశం, ఒకే భాష, ఒకే మతం ఒకే సంస్కృతి' అనే ఆలోచనా విధానం. ఇండియాకు బదులుగా హిందూ దేశంగానూ, దేశ ప్రజలందరూ హిందీ, సంస్కృతం నేర్చుకోవాలని వారు భావిస్తారు అందుకే, ముందుగా కేంద్రం ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలలో దానిని అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. అమిత్ షా నేతృత్వంలోని 'పార్లమెంటరీ కమిటీ ఫర్ అఫీషియల్ లాంగ్వేజెస్' 12 సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించింది. ఇది బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ కమిటీ సూచనల ప్రకారం విద్యాసంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐఎం, ఐఐటీ, ఎయిమ్స్, నవోదయ మొదలైన వాటిలో బోధన హిందీ మాధ్యమంలో ఉండాలి. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఎంట్రెన్స్ ప్రశ్నాపత్రం ఆంగ్లానికి బదులు హిందీలో ఇవ్వాలి. ఆర్ఎస్ఎస్ సంచాలకులుగా పనిచేసిన మోదీ, షా వారు కలలు కన్న విధివిధానాలను 130 కోట్ల భారతీయులపై రుద్దాలనుకుంటున్నారు. వారికి తగ్గట్టుగా చట్టాలను, విధాన నిర్ణయాలను మార్చివేయాలనుకుంటున్నారు. విద్యార్థులు, యువతలో హిందూత్వ భావజాలాన్ని ఎక్కించేందుకు నూతన జాతీయ విద్యా విధానం-2020 ముందుకు తెచ్చారు. కనీసం మేధావులు, అధ్యాపకుల సూచనలు కూడా తీసుకోకుండా, పార్లమెంట్‌లో పూర్తిగా చర్చించకుండా దీనిని ఆమోదించారు. ఈ నూతన విద్యా విధానంతో విద్యా కాషాయికరణ కావడం ఖాయం.
Also read: ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఏంటి?
నేర్చుకుని పరీక్షలు రాయాలా?
రాజ్యాంగంలోని షెడ్యూల్-8 ప్రకారం 22 భాషలను భారతీయ భాషలుగా, ఇంగ్లిష్, హిందీని అధికారిక భాషలుగా 1968లో ప్రకటించారు. వీటి వెలుగులోనే భారత అధికార భాషల చట్టం-1963 ప్రకారం 1967 పార్లమెంట్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో 20 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. వీరు ఏ అంశాలను అయినా రాజ్యాంగ పీఠిక మౌలిక అంశాలకు లోబడి చర్చించాలి. భిన్నంగా చర్చించకూడదు. దేశంలో సుమారు 800 భాషలు, 2 వేల యాసలు ఉన్నాయని కమిటీ గుర్తించింది. ఇవేవీ పట్టించుకోని కేంద్రం మాతృభాషలో చదువుకున్న విద్యార్థులను మోసగించి, హిందీలోనే నీట్, లాసెట్, క్యాట్ వంటి ఎంట్రెన్స్ పరీక్షలు రాయాలంటే విద్యార్థుల పరిస్థితి ఏంటి? వీరంతా హిందీ నేర్చుకొని పరీక్షలు రాయాలా?
కేంద్రం అనుసరించే విధానాలతో నష్టపోయేది పేద, మధ్యతరగతి విద్యార్థులే. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే భాష, సంస్కృతిను బలవంతంగా అమలు చేయాలనుకుంటున్నారు. బీజేపీ సోషల్ మీడియాను గుప్పిట పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నది. సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా హిందీని రుద్దాలని ప్రయత్నిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. విద్యార్థులు, యువత తీవ్రంగా వ్యతిరేకించాలి. భవిష్యత్ తరాల కోసం పోరాడాలి. ఈ విషయాలనే 4,5,6వ తేదీలలో వరంగల్‌లో జరుగనున్న పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలలో ప్రస్తావిస్తారు.
Also read: బీజేపీని తరిమికొడదాం
మామిడికాయల పరశురాం
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు
99086 18442