Model School Admissions: మోడల్ స్కూళ్లల్లో ప్రవేశాలకు ఈ నెల 23న నోటిఫికేషన్ రిలీజ్

by Maddikunta Saikiran |
Model School Admissions: మోడల్ స్కూళ్లల్లో ప్రవేశాలకు ఈ నెల 23న నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లల్లో(Model Schools) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష నోటిఫికేషన్ ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులను(Applications) స్వీకరించనున్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://telanganams.cgg.gov.in/ ద్వారా ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 125, ఓసీ విద్యార్థులకు రూ. 200 ఫీజు ఉంటుంది. మోడల్ స్కూళ్లల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది ఏప్రిల్ 13న ఎంట్రెన్స్ ఎగ్జామ్(Entrance Exam) నిర్వహిస్తామని మోడల్ స్కూల్ అదనపు సంచాలకుడు శ్రీనివాస చారి(Srinivasa Chari) తెలిపారు. ఆరో తరగతిలో అన్ని సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, ఏడు నుంచి పదో తరగతి వరకు సీట్లు ఖాళీ ఉంటేనే భర్తీ చేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed