- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీని తరిమికొడదాం
కరోనా వైరస్ కంటే భయంకరమైన 'మనువాదం' అనే వైరస్ ఆర్ఎస్ఎస్, బీజేపీ రూపంలో పొంచి ఉంది. బీజేపీ ఉత్తరాది ప్రజలను కులం, మతం, మూఢనమ్మకాల మత్తులో ముంచి విద్వేషాలను రెచ్చగొట్టి వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అదే అస్త్రాన్ని తెలంగాణ ప్రజలపై ప్రయోగించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నది అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ సమావేశాలను హైదరాబాద్‌కు మార్చారు.
బీజేపీ వచ్చాకే ఎక్కువ
'బేటీ బచావో-భేటీ పఢావో' అంటూనే, మహిళలు కేవలం ఇంటికే పరిమితమని ఆర్ఎస్ఎస్‌తో బహిరంగ ప్రకటన చేయించారు. 'థామ్సన్ రాయిటర్స్' 2011 లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఐదు దేశాలలో సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా చివరగా ఐదో స్థానంలో ఉంది. అదే సంస్థ 2018 లో మరోసారి ఇదే అంశంపై పది దేశాలలో సర్వే చేపడితే మన దేశం అగ్రస్థానంలో ఉంది. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మహిళలపై అఘాయిత్యాలు తీవ్రస్థాయిలో పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది. 2020 తో పోల్చితే 2021లో దాదాపు 20 శాతం మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక తెలిపింది. ఇవి ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లోనే జరగడం సిగ్గుచేటు.
మహిళలపై నేరాల రేటు పరంగా అసోం 168.3 శాతంతో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్‌లో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన నేరస్థులను క్షమాభిక్ష పేరుతో బయటకు తీసుకువచ్చారు. ఇవన్నీ గమనిస్తే ఆ పార్టీకి మహిళలపై వారి భద్రత పై ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మానభంగాలు ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే కావడం విశేషం. ఆ పార్టీ దేశాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం కులం, మతం మత్తులో దేశ ప్రజలను, యువతను ముంచి రాజకీయ లబ్ధి పొందుతున్నది. దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే మన దేశ లక్ష్యాలు ఎలా నెరవేరుతాయి. మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుంది.
ఆ ఆయుధంతో గద్దె దించాలి
నరేంద్ర మోడీ 2016 యూపీ ఎన్నికల ప్రచారంలో 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే పార్టీ లక్ష్యమని చెప్పి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు ఆదాయం రెట్టింపు చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేనందున అంతా ప్రైవేటుపరం చేసి రిజర్వేషన్లను పూర్తిగా తొలగించేలా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. కాళోజీ అన్నట్టు 'సొంత ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరెయ్యాలి. అదే ద్రోహం ప్రాంతేయేతరుడు చేస్తే పొలిమేర దాటే వరకు తరిమి కొట్టాలి' అనే సమయం ఆసన్నమైంది.
దేశంలో ఏ ఎన్నికలు జరిగిన ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులను 'మీరు ఇస్తానన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెరిగిన నిత్యావసర సరుకులు, పెట్రోల్ డీజీల్ రేట్లు, అధికంగా పెరిగిన జీఎస్టీ వంటివి వద్దని 2014 కి ముందు ఉన్న ధరలకు ఈ రేట్లను తగ్గించాలని' ప్రశ్నించాలి. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే ఎంతటి నాయకులకైనా, పార్టీలకైనా ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది.
మాణిక్ డోంగ్రే
సోషియాలజీ విద్యార్థి
99515 87876