- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఏంటి? ...
హిందూత్వం మత వాచకం కాదు, భావధార మతతత్వం కానే కాదు. హిందూత్వంలో కలుపుకునే శక్తి ఎక్కువ. అందుకే సకల ప్రాణి కోటిని ఆరాధించే సంస్కృతి ఉంది. సంపూర్ణ మానవాళి శ్రేయస్సు హిందూత్వంతోనే సాధ్యం. ఆరాధన పద్ధతులు వేరైనా, మతాలు వేరైనా జాతీయతకి వచ్చేసరికి దేశంలోని అందరి మూలం ఒక్కటవ్వాలని సంఘ్ కోరుకుంటుంది. సంఘ్ ప్రారంభంలోనున్న ఉద్దేశ్యాలే నేటికి కొనసాగడం విశేషం. సంఘ్ ప్రతి పనికి దేశం-హిందుత్వమే గీటురాయి. అది గో సంరక్షణ అయినా, గ్రామ వికాసం అయినా, సామాజిక సమరసత అయినా, పర్యావరణ పరిరక్షణ అయినా, ధర్మ జాగరణ అయినా, కుటుంబ ప్రబోధమే అయినా, ఆధారం హిందుత్వమే.
ఆర్ఎస్ఎస్ నేడు దేశంలో అసక్తికర అంశంగా, స్ఫూర్తి కేంద్రంగా మారింది. దీని గురించి పత్రికలలో విజయాలు, వివాదాలు వస్తూనే ఉన్నాయి. మేధావులు, రాజకీయవేత్తలు దీని గురించి చర్చిస్తూనే ఉన్నారు. వివిధ సాంప్రదాయ మఠాధిపతులు, వివిధ సామాజిక రంగాల ప్రముఖులు సంఘ్‌తో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నారు.ఇటీవల యువత ఆర్ఎస్ఎస్ వైపు ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు. సంఘ్ అధినేత ఢిల్లీలో ఓ మసీదు, ఓ మదర్సాని సందర్శించి జాతీయవాద శక్తిని ప్రదర్శించడం ఆశ్చర్యం. ఆర్ఎస్ఎస్‌ను మతోన్మాద సంస్థగా చిత్రీకరించే శక్తులకు దీని స్థాపన వెనుకనున్న ఉద్దేశ్యం, లక్ష్యం స్పష్టంగా తెలియదు. అందుకే దీనిని తరచూ విమర్శిస్తుంటారు. నేటితో ఆర్ఎస్ఎస్ ఏర్పడి 97 యేళ్లు పూర్తవుతున్నాయి.
జాతి ఐక్యత కోసం
సంఘ్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పూర్వికులది తెలంగాణ ప్రాంతమే. ఆయన ఆనాటి కాంగ్రెస్ , విప్లవ సంస్థలు, స్వాతంత్రోద్యమంలోనూ పాల్గొన్నారు. దేశ సమస్యలకు, విదేశీయుల దాడులలో ధర్మ సంస్కృతుల విఘాతానికి మన సమాజంలో ఉన్న అనైక్యత, ఆత్మ విస్మృతి లోపమే ప్రధాన కారణమని ఆయన గ్రహించారు. లోపాలను నిర్మూలించి, జీవన విలువలను పెంచి సామాజిక స్పృహ, జాతీయ భావన, సంఘటిత దృష్టి, కఠోర పరిశ్రమ, నిస్వార్థం, తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండటం, ఈర్ష్య, ద్వేషం లేకుండా ఉండటం వంటి నిర్మాణం వలనే మన దేశం సుఖంగా, వైభవంగా జీవించగలుగుతుందని భావించారు. ఇలాంటి గుణాలు కల వ్యక్తుల నిర్మాణం కోసమే 1925 విజయదశమి నాడు నాగ్‌పూర్ మెహితేవాడలో ఆర్ఎస్ఎస్ ప్రారంభించారు.హిందూ సమాజం ఐక్యమై ఏం చేయగలదు? అని ప్రశ్నిస్తే 'ఏదైనా చేయగలదు' అని ఆత్మవిశ్వాసంతో చెబుతుండేవారు.
ఇది ఏ వ్యక్తికీ, మతానికీ వ్యతిరేకం కాదని, హిందూ సంస్కరణ కోసమనే చెప్పేవారు. హిందూత్వాన్ని అర్థం చేసుకోలేని వారు సంఘాన్ని అర్థం చేసుకోలేరని అనేవారు. దేశ విభజన కుట్రను గమనించలేకపోతున్న తరుణంలో హెడ్గేవార్ దూరదృష్టితో ఆర్ఎస్ఎస్ అనే దారిదీపం తో మన జాతి ఆత్మను మేలుకొలిపి జాతిని ఐక్యత పరిచే కార్యాన్ని ముందుంచారు. సంఘ్ ప్రారంభించిన నాటి నుంచి జాతి ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా ఆర్ఎస్ఎస్ హిందూ సమాజ సంఘటన కార్యానికి శ్రీకారం చుట్టి. రోజూ గంట 'శాఖ' కార్యం ద్వారా సమాజహితం గురించి ఆలోచించే వ్యక్తులు దేశం నలుమూలల నుంచి కావాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం. దేశమంతటా దేశ హితం కోసం ఆలోచిస్తేనే హిందుత్వ ఆలోచనలు సాకారం అయ్యాయి. అందరిలో జాతీయభావాల కారణంగా ఏళ్ల తరబడి ఉండిపోయిన కాశ్మీర్ సమస్య, రామ జన్మభూమి సమస్య, తీవ్రవాద సమస్య, దేశ వ్యతిరేక కార్యకలాపాల వంటి వాటికి పరిష్కారం దొరికింది.
జాతీయత లక్ష్యం కావాలని
ఆర్ఎస్ఎస్ లక్ష్యం దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి ప్రపంచంలో అగ్రగామిగా నిలవడమే. దీనినే ప్రతి రోజూ 'పరమ్ వైభవన్ నేతు మేతత్ స్వరాష్ట్రమ్' అంటూ స్వయం సేవకులు శాఖలలో జరిగే ప్రార్థనలో గుర్తు చేసుకుంటారు. హిందూ రాష్ట్ర పరమ వైభవాన్ని సాధించడం సంఘ్ లక్ష్యం. ప్రతి మనిషి కూడు, గూడు, గుడ్డ, విద్య, ఆరోగ్యం, సంస్కారం కలిగి ఉండటం పరమ వైభవ స్థితి. 'ధర్మం' ధర్మ అనుష్టాన వ్యక్తి నిర్మాణం, ధర్మాధారిత సమాజ నిర్మాణం సంఘ్ లక్ష్యం. హిందూ ఆలోచన విశాలమైనది. హిందూత్వంలో విద్వేషం లేదు. హిందూత్వం మత వాచకం కాదు, భావధార మతతత్వం కానే కాదు. హిందూత్వంలో కలుపుకునే శక్తి ఎక్కువ. అందుకే సకల ప్రాణి కోటిని ఆరాధించే సంస్కృతి ఉంది. సంపూర్ణ మానవాళి శ్రేయస్సు హిందూత్వంతోనే సాధ్యం. ఆరాధన పద్ధతులు వేరైనా, మతాలు వేరైనా జాతీయతకి వచ్చేసరికి దేశంలోని అందరి మూలం ఒక్కటవ్వాలని సంఘ్ కోరుకుంటుంది.
సంఘ్ ప్రారంభంలోనున్న ఉద్దేశ్యాలే నేటికి కొనసాగడం విశేషం. సంఘ్ ప్రతి పనికి దేశం-హిందుత్వమే గీటురాయి. అది గో సంరక్షణ అయినా, గ్రామ వికాసం అయినా, సామాజిక సమరసత అయినా, పర్యావరణ పరిరక్షణ అయినా, ధర్మ జాగరణ అయినా, కుటుంబ ప్రబోధమే అయినా, ఆధారం హిందుత్వమే. నేడు దేశంలో 50 వేలకు పైగా గ్రామాలలో ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయి. లక్ష గ్రామాలకు చేరుకోవాలనేదే లక్ష్యం. సేవకుల ద్వారా దేశవ్యాప్తంగా 1.50 లక్షల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హిందూ సమాజంలో మనమందరం ఒకే జాతివారం అనే భావన రావాలి. హిందుత్వాన్ని మత కోణంలో, రాజకీయ కోణంలో ఆలోచించినంత వరకు ఆర్ఎస్ఎస్ అర్థం కాదు. దానిని అర్థం చేసుకోవాలంటే ఆరు మాసాలు అందులో పనిచెయ్యండని సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ చెప్పారు.
(నేడు ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భావ దినోత్పవం)
సామల కిరణ్
9951172002