- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదివాసీల ఆరాధ్యదైవం బిర్సా ముండా
బిర్సా ముండా భారతీయ గిరిజన తెగల స్వాతంత్ర్య సమరయోధు డు, జానపద నాయకుడు. ఇతడు ముండా జాతికి చెందినవాడు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బిహార్, జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో, బ్రిటిష్ కాలంలో జరిగిన స్వాతంత్ర్య పోరాట ఉద్యమానికి సారథ్యం వహించాడు. 22 ఏళ్ల వయసు( 1897)లోనే బ్రిటీషర్ల పై యుద్ధం ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర లో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. తన గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటాన్ని భారత ప్రభు త్వం ఏర్పాటు చేసింది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక గిరిజన తెగల నాయకుడు బిర్సా ముండా. బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారు. కనీసం పాతికేళ్లు కూడా దాటకుండానే ఇవన్నీ సాధించడం వల్ల ఈయన ఘనత మరింత ఉత్కృష్టమైనది. అతని చిన్నప్పుడు మిషనరీ పాఠశాలలో చదడంతో ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, దోపిడిని అర్థం చేసుకున్నాడు.
గొప్ప గిరిజన నాయకుడుగా ఎదిగి..
బ్రిటీష్ పాలకుల దోపిడీకి గురవుతున్న గిరిజనులను ఆ దోపిడీ నుండి రక్షించడానికి, వారి భూమిని కోల్పోకుండా నిరోధించడానికి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. అతను ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు, దీనిని "ఉల్గులన్" అని పిలుస్తారు. ఇది 19వ శతాబ్దం చివరిలో ప్రారంభమైంది. బిర్సా ముండా చోటా నాగ్‌పూర్, బెంగాల్, ఒడిశా అడవుల్లోని వివిధ గిరిజన తెగల ప్రజలను ఏకం చేశాడు. ఆయన బిర్సైట్ అనే కొత్త మత విశ్వాసాన్ని సృష్టించి, సామాజిక న్యాయం, మతపరమైన విషయాలను సాంప్ర దాయ ముండా విశ్వాసాలను మిళితం చేశాడు. చోటా నాగ్‌పూర్ కౌలు చట్టానికి ఏర్పాటుకు దారితీసింది బ్రిటీష్ దోపిడీకి వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన పోరాటమే. ఈ చట్టం గిరిజన ప్రజల నుండి గిరిజనేతరులకు భూమిని పంపకం చేయడాన్ని అడ్డుకట్ట వేసింది. బిర్సా ముండాను అతని అనుచరులు "భగవాన్" లేదా "బిర్సా భగవాన్" అని పిలిచేవారు, ఎందుకంటే అతను వారిని బ్రిటీష్ పాలకులు, వ్యాపారుల దోపిడీ, పీడన, ఇబ్బందుల నుండి రక్షించడానికి బ్రిటిష్ వారి నుండి గిరిజన తెగల ప్రజలను విడిపించడానికి వచ్చిన దేవుడని వారు నమ్ముతారు. గొప్ప గిరిజన నాయకునిగా భగవాన్ బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ 15ని ప్రతీ సంవత్సరం "జన జాతీయ గౌరవ్ దివస్"గా జరుపుకోవాలని 2023 సంవత్సరంలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజును "జనజాతీయ గౌరవ దివస్"గా ఘనంగా నిర్వహిస్తున్నారు. భగవాన్ బిర్సా ముండా వారసత్వం ఎల్లప్పుడూ ఆదివాసీలు, దళితులు, ఇతర అణగారిన వర్గాలకు వారి సామాజిక న్యాయ సాధనలో స్ఫూర్తినిస్తూనే ఉంది.
(నేడు బిర్సా ముండా జయంతి)
- గడుతూరి రామలక్ష్మి
కార్యవర్గ సభ్యులు, భారతీయ ఆదివాసుల సమాఖ్య
80743 74921