- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఏదో తక్కువ...
X
వీడు, వాడు,
ఇంకొకడు, మరొకడు
ఏ ఒక్కరెవరూ తేడా కాదు మరొకరికి..
అందరికీ
ఒకే ఆకలికి తీరే
కడుపు కోరిక ఒకటే...
ఒకే మాటకి
ఇష్టం పలికే బదులు ఒకటే...
కానీ ఏ ఒక్కరూ
మరొకరితో తూగని ఎక్కువ
ఏదో తక్కువ.
వీడు
పురాతన కొలమానం
ఆయుధంగా ఊపిరి కాగా
వెలి వేసుకుంటాడు చిత్రంగా...
వాడు
చదువు నేర్పిన హక్కు ఇచ్చిన
ఆలోచన ఎక్కించిన మెట్టుతో
మొదలవుతాడు గొప్పగా....
ఇంకోడు
కూడపెట్టిన కొండను తవ్వి
వంశ చరిత్రను మోస్తూ
తాత పోలికతో తరాన్ని ఏలుతాడు గుడ్డిగా..
మరొకడు
పుట్టుకలో బలాన్ని
పేరులో పిలిపించుకునే బలగంతో
ఏ మూలకైనా గుట్టుగా పాకుతుంటాడు...
వీరందరిలో
ఏదోక బలహీనత బలంగా
జరిగే పెనుగులాటలో
ఎదుట వారిలో ఏదో ఒక బలం
గురి చూడక తప్పదు
గుచ్చుకోక తప్పదు..
చందలూరి నారాయణరావు
97044 37247
Advertisement
- Tags
- poem
Next Story