RC 16: గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందే మరో సినిమా షూటింగ్‌కు సిద్ధమైన గ్లోబల్ స్టార్..?

by Anjali |
RC 16: గేమ్ ఛేంజర్ రిలీజ్‌కు ముందే మరో సినిమా షూటింగ్‌కు సిద్ధమైన గ్లోబల్ స్టార్..?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తోన్న భారీ ప్రాజెక్ట్ గేమ్ ఛేంజర్(Game Changer). ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సినిమా సంక్రాతి కానుకగా జనవరి 10 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. అయితే గేమ్ ఛేంజర్ విడుదల కాకముందే చరణ్ మరో సినిమాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు(Buchi Babu) దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. కాగా గ్లోబల్ స్టార్ ‘ఆర్‌సీ 16’(వర్కింగ్‌ టైటిల్) చిత్రీకరణ ఏకంగా ఇదే నెల(నవంబరు)లో ప్రారంభం కానున్నట్లు సోషల్ మీడియాలో గట్టి టాక్ వినిపిస్తుంది.

మొదటగా కర్ణాటక(Karnataka) రాష్ట్రంలో షూటింగ్ మొదలుపెట్టనున్నారట. అక్కడ పదిహేను రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో ముఖ్య తారాగణంపై అతి ముఖ్యమైన సీన్స్ ను చిత్రీకరించనున్నారని టాక్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) కథానాయికగా నటించగా.. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‘(Mythri Movie Makers), సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణ(Presented by Sukumar Writings)లో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు(Venkata Satish Kilaru) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విలేజ్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో కన్నడ కథానాయకుడు శివ రాజ్ కుమార్(Siva Rajkumar) కూడా ముఖ్యపాత్ర పోషించనున్నారట.

Advertisement

Next Story