- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అప్పుల బాధతో ఉరివేసుకోని వ్యక్తి ఆత్మహత్య

దిశ, కొండపాక: అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెంది చెట్టు కు ఉరి వేసుకోని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో చోటు చేసుకుంది. త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిసిన వివరాల ప్రకారం.. కొండపాక మండలం లోని దుద్దెడ గ్రామానికి చెందిన రోడ్డ మల్లేశం (31) టాటా ఎస్ మినీ గూడ్స్ వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తాగుడుకు బానిస అయ్యి అప్పులు చేసుకున్నాడు. ఆదివారం తన వాహనం కు టైర్ పంక్చర్ చేయించుకేని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి ఎంతకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా మృతుని బాబాయ్ రోడ్డ లక్ష్మణ్ వ్యవసాయ పొలం వద్ద చెట్టు కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య అనూష , కూతురు తన్విశ్రీ , కుమారుడు రేయాన్ష్ లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.