- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ప్రభుత్వ విద్యకు కొత్త వెలుగులు..
తెలంగాణా ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టు లకు పరీక్షలు నిర్వహించి చరిత్రలో ఎప్పుడూ లేని వి ధంగా కేవలం 70 రోజు ల్లొనే నియామక ప్రక్రియ పూర్తి చేసి అటు నిరుద్యోగుల కుటుంబాల్లో ఇటు ప్రభుత్వ బడుల్లో విద్య అభ్యసించే విద్యార్థుల భవిష్యత్‌కి కొత్త వెలుగులు తీసుకువచ్చింది. 15 వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చింది. 20 వేల మంది టీచర్లను బదిలీ చేసింది. విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఇంటిగ్రేటెడ్ గురుకుల వ్యవస్థకి నాంది పలికింది. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది. డైట్ మెస్ చార్జీలు పెం చింది. మండల విద్యా అధికారులను నియమించింది. ఇలా సీఎం, మంత్రులు విద్యా వ్యవస్థపై పూర్తి స్థాయిలో దృష్టి ఉంచడం మంచి పరిణామం. ఇటీవల టీచర్ల ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలు, పదవీ విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు కలిపి మరొక 15 వేల ఖాళీలు ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం, ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మరొక డీఎస్సీ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకై మరోసారి టెట్ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు..
అభ్యర్థులతో ఆడుకున్న గత ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 10 సంవత్సరాల్లో ఒకే ఒక్క డీఎస్సి 2017 (టీఆర్టి) ద్వారా 8792 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అదీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో జారీ చేసింది. ఆ తర్వాత అభ్యర్థులు 2021 నుంచి అనేక ఆందోళనలు చేస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు 5089 అరకొర పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల్లో ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే అభ్యర్థులు ఒత్తిడి చేయగానే లోక్‌సభ ఎన్నికల ముందు పాత నోటిఫికేషన్ రద్దు చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించి ఫలితాల వెల్లడి నియామక ప్రక్రియ రికార్డ్ సమయంలో పూర్తి చేసింది.
బడుల బాధ్యత.. వారి చేతుల్లోనే!
ప్రస్తుతం ఉన్న టీచర్లలో ఎక్కువమంది 40 సంవత్సరాల లోపే ఉన్నారు.. వారు ఉద్యోగం బాధ్యతగా వ్యవహరించి తమ సొంత పిల్లలకు ఏ రకమైన విద్య అందించాలి. వారు ఉపాధ్యాయ సంఘాలు టీచర్ల సమస్యలపైనే డిమాండ్స్ కాకుండా విద్యార్థులు భవిష్యత్‌కి కొత్త బాటలు వేయాలి. అందులో భాగంగా తమ డిమాండ్స్ ఉండాలి.. ఇప్పుడు ఏ విధంగా అయితే త్వరితగతిన ఖాళీలు భర్తీ చేసారో ప్రతిసారీ అలాగే నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రభుత్వ బడులకు మళ్లీ పూర్వ వైభవం రావాలని ఆ దిశగా ప్రభుత్వం, టీచర్లు అడుగులు వేయాలని ఆశిద్దాం..
రావుల రామ్మోహన్ రెడ్డి
93930 59998