- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రభుత్వం మిత్ర సర్కారేనా?
మాది ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. వారికి ఏ రాష్ట్రమూ ఇవ్వనంత జీతం, సౌకర్యాలు ఇస్తున్నాం' అంటూ తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ, ఏనాటి నుంచో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్‌గా ఉన్న సీపీఎస్‌ను రద్దు విషయంలో మాత్రం మౌనంగా ఉంటున్నది. పాత పింఛన్ విధానాన్ని అమలు చేసి రాష్ట్రంలో ఉన్న 1 లక్ష 78 వేల ఉద్యోగుల కుటుంబాలను మీ పార్టీకి అనుకూలంగా మార్చుకోవచ్చు కదా!? ముందుగా రాష్ట్రంలో దీనిని రద్దు చేసి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు కదా!?
వెసులుబాటు ఉన్నా
సీపీఎస్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే. కానీ, కొందరు రాష్ట్ర మంత్రులు రాష్ట్రానికి సంబంధించింది కాదని, కేంద్ర ప్రభుత్వ అంశమని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 1 జనవరి 2004 నుంచి తన పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్‌పీఎస్‌ను అమలు చేస్తున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశం కాదు. ఎన్‌పీఎస్‌లో చేరాలనుకునే రాష్ట్రాలు పీఎఫ్‌ఆర్‌డీఏతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించింది. నిర్ణయం రాష్ట్రాల ఇష్టాయిష్టాలకు వదిలేసింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 1 సెప్టెంబర్ 2004 నుంచి దీనిని సీపీఎస్‌గా అమలు పరిచారు. దీని నుంచి బయటకు రావడానికి 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలో వెసులుబాటు ఉండింది.
కానీ, ప్రస్తుత ప్రభుత్వం అపుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించకుండానే పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి వచ్చిన లెటర్‌కు జవాబు రాసింది. తాము ఎన్‌పీఎస్‌లో కొనసాగుతామని చెప్పి జీఓ నెంబర్ 28 విడుదల చేసింది. నిజానికి ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల పెన్షన్ అమలులో సంపూర్ణ అధికారం ఉంది. అందుకే రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, ఝార్ఘండ్, పంజాబ్ రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేశాయి. ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్న హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఎన్నికల హామీగా సీపీఎస్ రద్దు అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ దీని రద్దు అంశం చర్చలలో ఉంది. మన రాష్ట్రం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువరించడం లేదు.
ఉద్యోగుల సమస్యలు తీర్చి
సీపీఎస్ రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వంద కోట్ల రూపాయలు మిగులుతాయి. పీఎఫ్ఆర్‌డీఏ వద్ద ఉన్న పది వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగించుకోవచ్చు. ఇవేవీ పట్టించుకోకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడానికి ఎలాంటి న్యాయపర సమస్యలూ ఉండవు. దీని మీద ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అవగాహన లేదా? వారందరూ పాత పెన్షన్ స్కీమ్‌లో ఉన్నందున ప్రభుత్వానికి సలహా ఇవ్వలేకపోతున్నారా? ఐదు రాష్ట్రాలలో పాత పెన్షన్ కొనసాగిస్తుంటే అది మన ప్రభుత్వానికి కనబడకపోవడం ఆశ్చర్యకరం. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి.
దేశ రాజకీయాలలోకి వెళ్లాలనుకుంటున్న సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సహకారం లేకుండా మనుగడ సాధించడం కష్టం. స్వరాష్ట్రంలో సీపీఎస్ రద్దు చేస్తే జాతీయ పార్టీగా ఇతర రాష్ట్రాలలో ప్రభావంతంగా ఉంటుంది. సీపీఎస్ రద్దు, మూడు డీఏల విడుదల, ఉపాధ్యాయుల ప్రమోషన్స్, బదిలీలు, హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రిలలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం, పాఠశాలలో అటెండర్‌లను శాశ్వత ఉద్యోగులుగా నియమించడం, కర్మ దినాలు 13 రోజులకు పెంచడం, పీఆర్సీ ఏర్పాటు చేసి, 10.07.2023 నుంచి ఐఆర్ ఇవ్వడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
కర్రోళ్ల దేవయ్య
TSCPSEU రాష్ట్ర సహ అధ్యక్షుడు
9704746070