- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్ బీజేపీకే శత్రుదేశమా?
కర్ణాటక నుండి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ నాసిర్ హుస్సేన్ ఎన్నికైన సందర్భంగా ఆయన మద్దతుదారులు కొంతమంది 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాలు బహిరంగంగా చేసిన విషయం దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
స్వదేశంలో ఇలా స్లొగన్స్ స్వదేశ పౌరులు ఇవ్వడం తప్పు అని కాంగ్రెస్ నాయకులు వారించి ఉంటే ఈ సమస్య అంతటితో ఆగిపోయేది. ఈ విషయంపై ప్రతిపక్ష బీజేపీ నాయకులు విధాన సభ ముందు నిరసన తెలియజేయడం, ఈ నిరసనపై కాంగ్రెస్ విధానసభ కౌన్సిలర్ బీకే హరిప్రసాద్ ' పాకిస్తాన్ మాకు శత్రుదేశం కాదు బీజేపీకి మాత్రమే అన్న మాటలతో పాటు 'పాకిస్తాన్ జిందాబాద్' అనే వ్యాఖ్యలకు పరోక్ష మద్దతునిచ్చి మాట్లాడడం దేశ ప్రజలను నివ్వెరపరిచింది.
చదువు, సంధ్య లేని సామాన్య ప్రజలను కదిలించినా పాకిస్తాన్ తీరును బట్టి అది మనకు శత్రు దేశమే అని టక్కున అనేస్తారు. రాష్ట్ర శాసన నిర్మాణంలో భాగస్వామి అయిన ఒక కౌన్సిలర్... నాలుగు సార్లు మనతో యుద్ధం చేసి, మనకు అనేక విధాల నష్టం కలిగించి, మన దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు ప్రోత్సహించే దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిని పరోక్షంగా సమర్థిస్తూ మాట్లాడడం జాతీయ వ్యతిరేకం కాదా?
ముస్లిం ఓటర్లను తృప్తి పరచడానికి..
1946 డైరెక్ట్ యాక్షన్ పిలుపుతో దేశంలో నరమేధం జరిగి వేల మంది హిందువులు హత్యగావించబడ్డారు. లెక్కలేనంతమంది హిందూ స్త్రీలు మానభంగాలకు గురయ్యారు. ఈ విషయం ఈయనకు గుర్తు లేదేమో? ఈ దేశంలో రక్తపుటేరులు పారించి మతం ఆధారంగా ముస్లింలు రెండు భూభాగాలను ఈ దేశం నుండి బలవంతంగా తీసుకున్నారు. ఇది చరిత్ర. చారిత్రక అవగాహన లేకుండా, ముస్లింల ఓటు బ్యాంకును శాశ్వతంగా కొల్లగొట్టడం కోసం, దేశ భద్రతను, దేశ సమగ్రతను సైతం పణంగా పెట్టే పనులు కాంగ్రెస్ నాయకులు చేపట్టేందుకు సిద్ధమే అనే అనుమానం దేశ ప్రజలకు రావడం తోనే కాంగ్రెస్‌ను తిరస్కరించి, బీజేపీకి పట్టం కట్టారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించకపోవడం దురదృష్టకరం.
పుల్వామా దాడి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్లోని తీవ్రవాద కేంద్రాలపై జరిపిన సర్జికల్ దాడుల గురించి కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్ గాంధీ అపరిపక్వ వ్యాఖ్యలు చేయడం, బాట్లా ఎన్‌కౌంటర్ సమయంలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తీవ్రవాదుల మరణానికి కన్నీరు కార్చడం ఈ దేశంలో ముస్లిం ఓటర్లను తృప్తి పరచడం కోసమేననేది అందరికీ అర్థమైంది.
ఈ దేశం గాలి పీల్చుతూ..
సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేసిన తమ కార్యకర్తలను వెనకేసుకుని రావడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. సర్వ సైన్యాధిపతి బిపిన్ రావత్ ప్రమాదంలో చనిపోయినప్పుడు కొంతమంది ఆనందంతో కూడిన ట్వీట్లు చేశారు. ఇక క్రికెట్లో పాకిస్తాన్ భారత్‌పై గెలిచినప్పుడు దేశంలో కొన్ని ప్రాంతాల్లో టపాకాయలు పేల్చడం కేరింతలు కొట్టడం సర్వసాధారణమైంది. ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశం గాలి పీల్చుతూ, ఈ దేశ రక్షణను పొందుతూ, అనేక ప్రజాస్వామ్య హక్కులను అనుభవిస్తూ దేశ వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని తయారు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ నాయకులదే!. దేశ ఉత్థాన పతనాలతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రవర్తించడం జాతి హితైషులను బాధ పెట్టే విషయమే. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి, దేశానికి అనుకూలంగా ప్రవర్తిస్తే ప్రజలు ఆనందిస్తారు.
ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877