- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Common Recruitment Board: అసలు ఈ బోర్డ్ సాధ్యమా?
ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించామని చెబుతూనే, ఉస్మానియా యూనివర్సిటీ సెక్యూరిటీ విభాగంలో స్థానికేతరులను నియమించారు. బోధనా సిబ్బంది నియామకాలలో కూడా స్థానికేతరులకే లాభం కలిగేలా ఈ బిల్లును తీసుకొచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే, 15-20 యేండ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఈ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెయిటేజ్ ఇస్తుందో లేదో తెలియదు. అంతర్గత బదిలీలు చేసే ఆస్కారం ఈ బిల్లులో ఉంది. ఇది అవాంఛనీయం. యూజీసీ నిబంధనలకు ఇన్ని సవరణలు చేసిన ఈ బిల్లు న్యాయపరంగా నిలబడుతుందో లేదో ప్రభుత్వానికి తెలియదా? కావాలనే వర్సిటీల నియామకాలను తిలోదకాలు ఇవ్వాలని చూస్తున్నదా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లును వెనక్కి తీసుకుంటుందని ఆశిద్దాం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా యూనివర్సిటీలలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. పోస్టుల భర్తీ కోసం త్వరలోనే కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు(common recruitment board) ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించగానే నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లులో చాలా లొసుగులు ఉన్నాయని ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలు ఇందులో ఉన్న లొసుగులు ఏంటి? ఇది న్యాయస్థానంలో నిలబడుతుందా? యూజీసీ నిబంధనలు అమలవుతాయా? ప్రస్తుతం యూనివర్సిటీలలో అమలవుతున్న రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ల విధానం ఎలా ఉంటుంది?
అసలు ఈ బోర్డ్ సాధ్యమా?
సాధారణంగా వర్సిటీలలో ఖాళీల ఆధారంగా, సబ్జెక్టు, రిజర్వ్ కేటగిరీలను తెలుపుతూ నియామకాల కోసం ప్రకటన విడుదల చేస్తారు. దీని ప్రకారమే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. యూజీసీ(UGC) నిబంధనల ప్రకారం ఈ నియామకాలకు ఒక సెలెక్షన్ కమిటీ ఉంటుంది. దీనికి వర్సిటీ వీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సంబంధిత శాఖ హెడ్, డీన్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, చాన్సలర్ నామినీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా విభాగాల నుంచి సభ్యులు ఉంటారు. వీరంతా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్‌లో విధిగా పాటించాల్సిన రోస్టర్ పాయింట్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ఈ కమిటీ సెలెక్ట్ చేసిన జాబితాను ఆ యూనివర్సిటీ పాలకమండలి ఆమోదిస్తేనే వారి నియామకాలు జరుగుతాయి. ఇదంతా పారదర్శకంగా జరుగుతుంది. మరి కొత్త బోర్డు ఎలా ఉంటుంది? గతంలో 'ఉస్మానియా' సెలెక్షన్ కమిటీలో కొంతమందిని తొలగించి, వారి స్థానంలో ప్రిన్సిపాల్స్‌ను, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌లను సభ్యులుగా చేర్చి సెలెక్షన్ నిర్వహించారు. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని కోర్టు వాటిని రద్దు చేసింది. ఫలితంగా మరోసారి నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాల్సి వచ్చింది.
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువస్తున్న బిల్లు ప్రకారం సెలెక్షన్ కమిటీలో విద్యా శాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండబోతున్నారు. కమిటీకి చైర్మన్‌గా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఉండబోతున్నారు. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. న్యాయస్థానాల ముందు చెల్లుబాటు అవుతుందా? నియామకాల సమయంలో ఒక్కో వర్సిటీలో ఒక్కోలా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లు ఉంటాయి. అలాంటప్పుడు ఈ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏ రోస్టర్ విధానాన్ని పాటించి అభ్యర్థులను ఎంపిక చేస్తుందనేది ప్రశ్న. ఒక్కో వర్సిటీలలో ఒక్కో సబ్జెక్టు ఉండదు అలాంటప్పుడు ఈ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు వలన కలిగే ప్రయోజనం ఏంటి?
ఆ నిబంధనలు సవరించి
సెలెక్షన్ కమిటీల నిర్మాణం యూజీసీ నిబంధనల ప్రకారం జరగలేదని గతంలో తప్పు పట్టిన న్యాయస్థానాలు వీసీల నియామకంలోనూ అలాగే స్పందించాయి. మన రాష్ట్రంలో వీసీల నియామకానికి వర్తించే యూజీసీ నిబంధనలు సవరించారు. వీసీ కావాలంటే పదేండ్ల బోధన అనుభవం ఉండాలి. దానిని ఐదేండ్లకు కుదించారు. వీసీల నియామకం గవర్నర్ ద్వారా జరగాలి. ఆ అధికారం ముఖ్యమంత్రికి కట్టబెట్టారు. వర్సిటీలకు చాన్స్‌లర్‌గా గవర్నర్ ఉన్నారు. దీనిని కూడా ముఖ్యమంత్రికి మార్చాలనుకుంటున్నారు. గతంలో ఈ సవరణలన్నింటినీ సుప్రీం ధర్మాసనం తప్పు పట్టినా, ప్రభుత్వం వాటినే తిరిగి తెర మీదకు తెచ్చింది.
గతంలో జరిగిన తప్పుడు నియామకాల మీద న్యాయస్థానాలలో కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించామని చెబుతూనే, ఉస్మానియా యూనివర్సిటీ(Osmaia university)సెక్యూరిటీ విభాగంలో స్థానికేతరులను నియమించారు. బోధనా సిబ్బంది నియామకాలలో కూడా స్థానికేతరులకే లాభం కలిగేలా ఈ బిల్లును తీసుకొచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే, 15-20 యేండ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఈ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెయిటేజ్ ఇస్తుందో లేదో తెలియదు. అంతర్గత బదిలీలు చేసే ఆస్కారం ఈ బిల్లులో ఉంది. ఇది అవాంఛనీయం. యూజీసీ నిబంధనలకు ఇన్ని సవరణలు చేసిన ఈ బిల్లు న్యాయపరంగా నిలబడుతుందో లేదో ప్రభుత్వానికి తెలియదా? కావాలనే వర్సిటీల నియామకాలను తిలోదకాలు ఇవ్వాలని చూస్తున్నదా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లును వెనక్కి తీసుకుంటుందని ఆశిద్దాం.
జీవన్
రీసెర్చ్ స్కాలర్, ఓయూ
88850 99930
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672