- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెరిగిన బాస్మతి బియ్యం ఎగుమతులు..
బాస్మతి బియ్యం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బిర్యానీ వంటకం. వీటికి ఉండే ప్రత్యేకమైన రుచి, సువాసనే కాకుండా సాధారణ బియ్యం 89 గ్లైసెమిక్ ఇండెక్స్ (జి.ఐ)తో పోల్చితే, ఇవి 56 నుండి 69 మధ్య జి.ఐ కలిగి ఉండడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉండే కారణంగా వీటి ఖరీదు కాస్త ఎక్కువే...!
మనదేశంలో బాస్మతి బియ్యం భారత ఉపఖండంలో శతాబ్దాలుగా సాగు అవుతోందని ఆధారాలున్నాయి. 1766 సం.లో పంజాబీ కవి వరిస్ షా రచించిన హీర్ రాంఝా అనే ఇతిహాసంలో బాస్మతి బియ్యం గురించిన ప్రస్తావన ఉంది. మన దేశంలో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ , ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో బాస్మతి వరిని పండిస్తారు. ప్రపంచ బాస్మతి బియ్యం ఉత్పత్తిలో భారతదేశం వాటా సుమారు 70% పైగానే ఉంటుంది. అందులో కొంత భాగాన్ని సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. ఖేతీ విరాసత్ మిషన్ వంటి సంస్థలు భారతదేశంలోని పంజాబ్‌లో పండిస్తున్న ఆర్గానిక్ బాస్మతి బియ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి.
34 బాస్మతి బియ్యం రకాలు..
ఇండియన్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎ.పి.ఇ.డి.ఎ) ప్రకారం కనీసం 6.61 మి.మీ పొడవు, 2 మి.మీ వెడల్పు గల బియ్యం రకాన్ని బాస్మతి బియ్యం అని పిలుస్తారు. ఇప్పటివరకు 34 బాస్మతి బియ్యం రకాలు, 1966 విత్తనాల చట్టం ప్రకారం గుర్తించబడ్డాయి. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే గణాంకాలను అగ్రి ఎక్సేంజ్ విడుదల చేస్తుంది. ఎగుమతి గణాంకాలు అనేవి అమ్మకం లేదా వ్యాపారం కోసం మరొక దేశానికి పంపబడిన వస్తువులు గురించి సమాచారాన్ని సూచిస్తుంది. మనదేశంలో అగ్రి ఎక్సేంజ్‌లో ఈ సమాచారం సూచించడానికి యు.ఎన్.కామ్ట్రేడ్, ఎఫ్.ఎ.ఒ, డి.జి.సి.ఐ.ఎస్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్) వంటి విశ్వసనీయ సమాచార మూలాధారాల నుండి సేకరిస్తుంది.
5 దేశాలకు.. ఎగుమతులు
ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తలు సాంప్రదాయ బాస్మతి యొక్క చాలా మంచి లక్షణాలను కలిగి ఉన్న హైబ్రిడ్ సెమీ డ్వార్ఫ్ మొక్కలను ఉత్పత్తి చేయడానికి సాంప్రదాయ మొక్కల పెంపకాన్ని ఉపయోగించారు. ఈ హైబ్రిడ్‌ను పూస బాస్మతి 1 (పి.బి.1 ) అని పిలిచారు. ఇది సంప్రదాయ రకాల కంటే రెండు రెట్లు అధికంగా పంట దిగుబడినిస్తుంది. ఇంకా పి.బి.2 , పి.బి 3, ఆర్.ఎస్ 10 రకాలను కూడా అభివృద్ధి పరిచారు. 2022-23 సం.లో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ యెమిరేట్స్, యెమన్ రిపబ్లిక్‌లకు ఎగుమతి చేసిన బాస్మతి బియ్యం మార్కెట్ విలువ అమెరికన్ డాలర్లలో వరుసగా 1036 మిలియన్లు, 980 మిలియన్లు, 375 మిలియన్లు, 334 మిలియన్లు, 307 మిలియన్లుగా నమోదయ్యాయి. బాస్మతి బియ్యం పరిమాణంలో చూస్తే ఈ ఐదు దేశాలకు ఎగుమతులు వరుసగా 954, 484 మెట్రిక్ టన్నులు, 998,879 మెట్రిక్ టన్నులు, 364, 064 మెట్రిక్ టన్నులు, 315,313 మెట్రిక్ టన్నులు, 289,604 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. మన దేశ బాస్మతి బియ్యం మొత్తం ఎగుమతుల్లో సగానికి పైగా ఈ 5 దేశాలకే ఎగుమతి చేయబడుతూ అగ్ర భాగాన్ని ఆక్రమించాయి.
జీడీపీ పెరుగుదలకు తోడ్పాటు..
భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం ఎగుమతుల్లో 2018-19 సం.లో 4712 మిలియన్ల అమెరికన్ డాలర్ల మార్కెట్ విలువ గల బాస్మతి బియ్యం ఎగుమతి చేయగా, 2019-2020 సం.లో 4371, 2020-21సం.లో 4018, 2021-22 సం.లో 3540, 2022-23 సం.లో 4787 అమెరికన్ మిలియన్ డాలర్లుగా ఉంది. అదే 2023-24 ఏప్రిల్ నుండి జూలై నెలల మధ్యలో వీటి విలువ 1773 అమెరికన్ మిలియన్ డాలర్ల గా ఉంది. అదే ఈ దేశాలకు ఎగుమతి చేసిన బియ్యం పరిమాణం ఎగుమతులను ఆయా సంవత్సరాలకు చూస్తే 44,15,085 మె.ట , 44,54,713 మె. ట, 46,31,531 మె.ట, 39,47,973 మె.ట , 45,60,762 మె.ట, 16,09,447 మె.టన్నులుగా ఉంది. ఈ గణాంకాలు పరిశీలిస్తే బాస్మతి బియ్యం ఎగుమతులలో 2018-19 సంవత్సరంతో పోలిస్తే 2022-23 సంవత్సరానికి పరిమాణంలోనూ, మార్కెట్ విలువలోను గణనీయమైన పెరుగుదల నమోదైనట్లు గమనించవచ్చు. ఇప్పటి మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా బాస్మతి బియ్యం ఎగుమతులు నిషేధించినా, తరువాత కాలంలో ఆంక్షలు సడలించిన తర్వాత మన దేశ రైతులతో పాటు దేశ జీడీపీ పెరుగుదలకు ఈ ఎగుమతులు ఎంతో దోహదం చేస్తాయి.
డిజె మోహన రావు
82470 45230