- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐ2యూ2 దేశాల చూపు మన వైపు!భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగబోతుందా?
2021లో మన భారతదేశానికి 87 బిలియన్ల అమెరికన్ డాలర్లు రెమిటెన్స్ రాగా, అందులో ఒక్క అమెరికా నుంచే 23 బిలియన్ల అమెరికన్ డాలర్లు వచ్చాయి. యూఏఈ నుంచి 18 బిలియన్ల అమెరికన్ డాలర్లు, సింగపూర్ నుంచి 7 బిలియన్ల అమెరికన్ డాలర్లు వచ్చాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాలు నుంచి రెమిటెన్స్ తగ్గుతుంది. ఇదే సమయంలో ఖతార్ తన ఇరుగు పొరుగు దేశాలతో ఎక్కువ ప్రాధాన్యత గల దేశంగా మారుతుంది. పాకిస్థాన్, టర్కీ వంటి దేశాల వైపు మొగ్గు చూపుతుంది. ఇటువంటి పరిణామాలు నేపథ్యంలో సౌత్ అరేబియా, ఐ2యూ 2 దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుని, బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించాలని ఆశిద్దాం.
చైనా తన ఇరుగు పొరుగుదేశాలతో సంఘర్షణ వైఖరి కొనసాగించడం మూలంగా ఈ ప్రాంత దేశాల మధ్య శాంతిభధ్రతలకు విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్, పసిఫిక్ దేశాల మధ్య సంబంధాలు కీలకం కానున్నాయి. ఇటీవల ఏర్పడిన 'క్వాడ్' కూటమి కొంచెం మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చు. ఇదే సమయంలో ఇటీవల ఏర్పడిన ఇండియా, ఇజ్రాయెల్, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ఐ2యూ2) కొత్త కూటమి మరింత రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో అభివృద్ధి సాధించుటకు బాటలు వేయాలని సమిష్టిగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దేశాలలో పర్యటించి, కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో గ్లోబల్ ఎనర్జీ విషయంలో ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంతేకాకుండా, గల్ఫ్ దేశాలకు సైనిక సహకారం, శాస్త్ర సాంకేతిక రంగాలలో అమెరికా సహకారం అందించుటకు అంగీకరించింది. ఇప్పటికే అమెరికా 'బహ్రెయిన్'లో తన ఐదవ 'ఫ్లీట్' ఏర్పాటు చేసింది. జో బైడెన్ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో మొదటి ఐ2యూ2 సమావేశం జరుగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అక్కడ చురుకుగా ఉండాలి
ఇండియా-పసిఫిక్ ప్రాంతంలో సముద్రయానం, చమురు సరఫరా, అందునా హిందూ మహాసముద్రం చురుకుగా ఉండాలంటే, ఇండియా కీలక పాత్ర పోషించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ కోరుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐ2యూ2 సమావేశం సమావేశాన్ని వాషింగ్టన్‌లో యూఏఈ రాయబారి యూసఫ్ ఆలీ ఒటియాబా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఇజ్రాయెల్ ప్రధాని యూ లాపిడ్ కూడా హాజరయ్యారు. ఇటీవల కాలంలో భారత్- యూఏఈ సంబంధాలు కూడా బలపడ్డాయి.
ఇదే సమయంలో ఇండియా-సౌదీ అరేబియా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఆరు అంశాలు వాటర్, ఎనర్జీ, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత లలో ఐ2యూ2 దేశాలు మధ్య మంచి అవగాహన కుదుర్చుకునేలా ముందుకు సాగుతున్నారు. ఇది గల్ఫ్ దేశాలకు మరింత అవసరం కూడా. ఇదే సమయంలో గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న భారతీయుల నుంచి ఇండియాకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం (రెమిటెన్స్ ) తగ్గుతుంది. ఇది గమనంలోకి తీసుకోవాలి.
ఫుడ్ పార్క్ ఏర్పాటు దిశగా
ఈ ఐ2యూ2 లో ప్రధాన అంశం 'ఫుడ్ పార్క్‌ల ఏర్పాటు. దీనిలో భాగంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, ప్రాజెక్టులు ప్రారంభించడానికి స్థలాలు కేటాయించాలి. భారత వ్యవసాయదారులను సమ్మిళితం చేయాలని కోరుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రైవేటు సంస్థలు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టులు ప్రారంభించడానికి భారతదేశం వీలు కల్పించాలంటున్నారు. ఈ ఫుడ్ పార్క్ ప్రాజెక్టు వలన పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ వారికి ఆహార భద్రత కలుగుతుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మన భారతదేశంలో రెండు బిలియన్ల అమెరికన్ డాలర్లు పెట్టుబడులు పెట్టి ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేయడానికి కదులుతున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్ సహకారంతో కొత్త శాస్త్ర సాంకేతిక విధానాల ద్వారా ఫ్రెష్ వాటర్, రెన్యువబుల్ ఎనర్జీ ఉపాధి అవకాశాలు కల్పించుటకు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇదే ఇండియాతో అతిపెద్ద 'జాయింట్ కొలాబరేషన్ ప్రాజెక్టు'. దీని వెనుక అరబ్ దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా ప్రోత్సాహం ఉంది. వచ్చే సంవత్సరం 2023లో 'కాప్-28' సదస్సు యూఏఈ నిర్వహిస్తుంది.
ఆయా దేశాలతో ఒప్పందాలు
జో బైడెన్ తన పర్యటనలో 5.3 బిలియన్ల అమెరికన్ డాలర్ల సైనిక ఒప్పందాలు యూఏఈ, సౌదీ అరేబియాతో చేసుకున్నారు. ఈ ఐ2యూ2 సదస్సు ద్వారా భారత్‌లో ఈ దేశాలు పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశానికే కాకుండా, ఆహార పదార్థాలు సరఫరా గల్ఫ్ దేశాలకు కూడా మరింత ఉపయోగకరంగా ఉంటుంది అని తెలిపారు. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లిన కేరళీయుల ద్వారా ముఖ్యంగా గల్ఫ్ దేశాలు నుంచి ఎక్కువ రెమిటెన్స్ వచ్చేది. ఇటీవల తగ్గుముఖం పట్టింది.
2021లో మన భారతదేశానికి 87 బిలియన్ల అమెరికన్ డాలర్లు రెమిటెన్స్ రాగా, అందులో ఒక్క అమెరికా నుంచే 23 బిలియన్ల అమెరికన్ డాలర్లు వచ్చాయి. యూఏఈ నుంచి 18 బిలియన్ల అమెరికన్ డాలర్లు, సింగపూర్ నుంచి 7 బిలియన్ల అమెరికన్ డాలర్లు వచ్చాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాలు నుంచి రెమిటెన్స్ తగ్గుతుంది. ఇదే సమయంలో ఖతార్ తన ఇరుగు పొరుగు దేశాలతో ఎక్కువ ప్రాధాన్యత గల దేశంగా మారుతుంది. పాకిస్థాన్, టర్కీ వంటి దేశాల వైపు మొగ్గు చూపుతుంది. ఇటువంటి పరిణామాలు నేపథ్యంలో సౌత్ అరేబియా, ఐ2యూ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుని, బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించాలని ఆశిద్దాం.
Also Read : ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే, పండుగరోజు మీకో గుడ్ న్యూస్
ఐ.ప్రసాదరావు
63056 82733