- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంస్మరణ:త్యాగశీలి హోలిక
హోలీ పండుగ రోజున రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవడం రివాజు. పురాణాల ప్రకారం ఈ పండుగకు ఒక ప్రాశస్త్యం ఉంది. హిరణ్యకశ్యపుని సోదరి హోలిక దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని తెలుస్తోంది. దైవభక్తి కలిగిన వారిని కష్టాల నుంచి కాపాడి, దేవుడు ఎల్లవేళలా రక్షణగా ఉంటాడని సందేశమిచ్చే హోలిక దృష్టాంతమే హోలీ జరపడానికి కారణమని హేమాద్రి కాండ, భవిష్యత్ పురాణం, ధర్మసింధు, నిర్ణయ సింధు రుజువు చేస్తున్నాయి.
హోలిక రాక్షస వర్గానికి చెందినదిగా గుర్తించినప్పటికీ, నిజానికి ఆదిమ జాతి సంతతిలో పుట్టి, తనకంటూ ఒక విశిష్టత కలిగిన త్యాగమూర్తి. రావణాసురుడు ఎంత గొప్ప శివభక్తుడో హోలిక కూడా అంతే భక్తురాలు.బ్రహ్మదేవుని మెప్పించి మాయా వస్త్రాన్ని పొందిన ఘనత హోలికది. హోలిక హిరణ్యకశిపుని సోదరి. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పరాయణుడు కావడంతో ఆగ్రహించి, అతడిని ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు హిరణ్యకశిపుడు. నిత్యం నారాయణ మంత్రం జపిస్తున్న ప్రహ్లాదుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల క్షేమంగా ఉంటాడు.
చివరకు హిరణ్యకశిపుడు ప్రహ్లదుడిని చంపడానికి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. అప్పటికే బ్రహ్మదేవుడి వరం వలన హోలిక కు మాయా వస్త్రం లభిస్తుంది అది ఎంతటి భయంకరమైన అగ్ని అయిన ఆ వస్త్రాన్ని ధరిస్తే ఆహుతి కాలేరు. హోలికను ఆ వస్త్రాన్ని ధరించమని చెప్పి, ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టి, తన భక్తుల చేత నిప్పు అంటింపజేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణు మాయ చేత హోలిక కప్పుకున్న ఆ వస్త్రం గాలికి ఎగిరిపోయి ఆమె దగ్ధమవుతుంది. ప్రహ్లాదుడు మాత్రం క్షేమంగా బయట పడతాడు. ఈ విధంగా హోలిక దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హొలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు.
అన్న మాట కాదనలేక
రామాయణంలో సుగుణాల సీత ఎలాగో మరో కోణంలో హోలిక కూడా నిస్వార్థమైన త్యాగ ధనురాలు. అరణ్యవాసం తర్వాత రాముడు సీతపై నీలాపనిందలు వేసి అగ్నిపరీక్ష పెడితే కూడా భర్త మాట జవదాటలేదు. అలాగే హోలిక ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసి కూడా తన సోదరుడు హిరణ్యకశిపుని ఆజ్ఞను కాదనకుండా తన మేనల్లుడైన ప్రహ్లాదుని తో కలిసి అగ్ని ప్రవేశానికి పూనుకున్నది. ఆత్మ బలిదానానికైనా వెనకాడలేదు హోలిక. అంటే ఆనాటి ఆదిమజాతి వారి ఔదార్యం, ఆత్మత్యాగాలు ఎంత గొప్పవో పురాణాలను బట్టి అవగతమవుతున్నవి. పూర్వకాలం నుంచి వారసత్వ త్యాగాలు ఉన్నవే కదా !
గుమ్మడి లక్ష్మీనారాయణ
సామాజిక రచయిత
94913 18409