- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేతలకు కాకా రోల్ మోడల్!
కాకా దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సహాయం చేసేవారు. కాకాకు నల్ల బంగారు నేల అన్నా ఇక్కడి మనుషులన్నా చాలా ఇష్టం. ప్రేమ ఉండేవి. 101 కార్మిక సంఘాలకు రాష్ట్రంలో నాయకత్వం వహించారు. ఆయనకు కార్మికులంటే ఎంతో ప్రేమ. బీఐఎఫ్ఆర్ నుంచి సింగరేణిని కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. సింగరేణిని ఆర్థికంగా కేంద్రం నుంచి అప్పు, మారటోరియం ఇప్పించి కాపాడారు. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో ప్రభుత్వాన్ని కోరిన మొదటి ఎంపీ. కాకా ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు చేప్పేవారు.
తెలంగాణలోనే కాదు, దేశంలోనూ ఆయన జీవితం రాజకీయాలకు, రాజకీయ నేతలకూ ఆదర్శవంతం. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఆయన తెలంగాణ కొంగు బంగారం, గుండె చప్పుడు. దళిత దిగ్గజం. అణగారిన సమాజానికి అండదండ. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 'గడ్డం వెంకటస్వామి' ప్రజలకు 'కాకా' గా సుపరిచితులు. 1929 అక్టోబర్ 5న జన్మించిన కాకా దళిత నేతగా, దేశం గర్వించే నాయకుడిగా ఎదిగారు. ఆయన ఎప్పుడూ నిజం వెంట ఉండేవారు. నేల విడిచి సాము చేయలేదు. పోరాటాలు చేసి హైదరాబాద్‌లో వేలాది మంది పేదలకు చేసి ఇంటి స్థలాలు తెప్పించిన ఘనత కాకాదే. అందుకే ఆయనను 'గుడిసెల వెంకటస్వామి' గా కూడా పిలుస్తారు.
రౌండ్ ది క్లాక్ సేవలు
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో కాకా పాత్రను విస్మరించలేం. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో గొడవకు దిగారు. సీడబ్ల్యూసీ సమావేశాన్ని బహిష్కరించి, అక్కడి నుంచే తెలంగాణ ఇవ్వాల్సిందే అని నినదించారు. ఉద్యమానికి ఎంతో చేయూతనిచ్చారు. ఆయన స్థిరమైన రాజకీయాలకు ప్రతీక. నమ్మిన సిద్ధాంతం దాటి ఎన్నడూ భిన్నంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. నిత్యం పేదోడి హక్కుల కోసం తపించే, జ్వలించే మనస్తత్వంతో ఉండి పోరాడాలని ఆరాటపడేవారు. ఆయన సామాన్యులను సైతం ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా రౌండ్ ది క్లాక్ కలిసేవారు. నేను ఒక జర్నలిస్ట్‌గా, మనిషిగా కాకా ను చాలా దగ్గరగా చూశాను. ఆయన ప్రజలే ఊపిరిగా బతికారు.
ఎన్నికలలో గెలిచినా, ఓడినా, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పనిచేసిన సామాన్యుడిలా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా పోలీసులు నక్సలైట్ల పేరిట అమాయకులను రాత్రికి, రాత్రే ఎన్‌కౌంటర్ చేస్తే తీవ్రంగా ఖండించేవారు. బూటకపు ఎన్‌కౌంటర్లను బహిరంగంగా వ్యతిరేకించేవారు. అలాగే నక్సల్స్‌తో చర్చలు జరపాలని కోరేవారు. మరణించినవారి ఇంటికి వెళ్లి పరామర్శించేవారు. అది ఆయనలో మానవీయతకు నిదర్శనం. ఎన్‌కౌంటర్లు ఆపాలని అప్పటి సీఎం వైఎస్ఆర్‌ను కోరారు. ఆయన తర్వాత అంత పేరు తెచ్చుకున్నది ఆయన చిన్న కొడుకు 'గడ్డం వివేక్ వెంకటస్వామి' తండ్రి అడుగుజాడలలో నడుస్తున్నారు.
ఆయన పాత్ర విస్మరించరానిది
కాకా దగ్గరకు వచ్చిన ప్రతీ ఒక్కరికి పార్టీలతో సంబంధం లేకుండా సహాయం చేసేవారు. కాకాకు నల్ల బంగారు నేల అన్నా ఇక్కడి మనుషులన్నా చాలా ఇష్టం. ప్రేమ ఉండేవి. 101 కార్మిక సంఘాలకు రాష్ట్రంలో నాయకత్వం వహించారు. ఆయనకు కార్మికులంటే ఎంతో ప్రేమ. బీఐఎఫ్ఆర్ నుంచి సింగరేణిని కాపాడటంలో కీలకంగా వ్యవహరించారు. సింగరేణిని ఆర్థికంగా కేంద్రం నుంచి అప్పు, మారటోరియం ఇప్పించి కాపాడారు. బొగ్గు గని కార్మికులకు ఐటీ మాఫీ చేయాలని కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంటులో ప్రభుత్వాన్ని కోరిన మొదటి ఎంపీ. కాకా ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు చేప్పేవారు.
ఆయన వద్ద ఎలాంటి దాపరికాలు, డాంబికాలు ఉండేవి కావు. ఓపెన్ హార్ట్, ఓపెన్ హ్యాండ్స్ కాకాకే స్వంతం. ఎన్నో దానాలు, గుప్త దానాలు చేసిన నేత. తెలంగాణ ఉద్యమంతో సహా ఎన్నో ఉద్యమాలకు పోరాటాలకు ఆయనిచ్చిన చేయూత మరవలేనిది, విస్మరించరానిది. కాకా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ తో తలపడ్డారు. ప్రాజెక్టు శంకుస్థాపన రోజు అక్కడికి వచ్చి సభలోనే తన ఆశయం నెరవేర్చినందుకు వైఎస్ఆర్‌కు ధన్యవాదాలు చెప్పారు. కాకా లాంటి నేతలు దేశంలో అరుదు. ఆయన వేసిన బాటలో ఎన్నో ఆదర్శాలు, జ్ఞాపకాలు నేటికి వెంటాడుతూనే ఉంటాయి. 22 డిసెంబర్ 2014న కాకా మనలను వీడిపోయారు. కాకా మాట్లాడిన ప్రతీ మాటను వాడి ఎంతో అద్భుతంగా వాడి 'మేరా సఫర్' పేరిట ప్రముఖ రచయిత పి.చందు రాసిన కాక జీవిత చరిత్రను తప్పక చదివి చాలా నేర్చుకోవాల్సిందే. కాకా ఎక్కడున్నా 'హ్యాపీ బర్త్ డే టూ యూ'.
(నేడు కాకా జయంతి)
ఎండీ మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223