శపథం నుంచి ప్రగతి పథం వైపు..

by Ravi |   ( Updated:2024-06-21 01:00:55.0  )
శపథం నుంచి ప్రగతి పథం వైపు..
X

నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు డీఎస్సీ పైనే తొలి సంతకం చేశారు. ఎందుకంటే 'టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే' అని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతూ మూడో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం... వీటి ప్రాధాన్యతను గమనిస్తే ఆభివృద్ది సంక్షేమం పై కొత్త ప్రభుత్వ దృక్పధాన్ని లక్ష్య నిర్దేశ్యాన్ని లక్ష్యం దిశగా పనిచేయ్యాలన్న ఆశయాన్ని ప్రస్పుటింపజేస్తున్నాయి.

ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు అవమానించడంతో మనస్తాపానికి గురైన చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రి అయ్యాకే ఏపీ అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేసిన విషయం తెలిసిందే. ఈ కౌరవ సభలో ఉండలేను.. సీఎంగానే సభకు వస్తా.. లేకుంటే ఈ రాజకీయాలే అవసరం లేదు అంటూ బాబు శపథం చేశారు.

ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మారిపోయి చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారు. దీంతో టీడీపీ అనూహ్యంగా పుంజుకుంది. జనసేన పార్టీతో కుదిరిన పొత్తు మరింత బలం చేకూర్చింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు తదితర పరిణామాలు వేగంగా మారిపోయాయి. కుదుపుల కూటమి మోదీ అమిత్ షా సభలతో చంద్రబాబు చాణక్యంతో ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది.

నాడు శపథం.. నేడు ప్రగతిపథం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మూస ఒరవడిని మాని ఆనవాయితీలను కాదని నిజాయితీ, నిబద్ధతతో కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారిని ఓరిమితో కూటమి కూడా కలుపుకుని యువతకు మహిళా సాధికారతకు స్థానం కల్పిస్తూ ఆందరిని విస్మయానికి గురిచేసిన కూర్పుగా ఈ మంత్రి మండలి కూర్పు ఇటు రాజకీయ వర్గాలలోనూ అటు పార్టీలోనూ జరుగుతున్న చర్చ. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ప్రమాణం చేశారు.ఈ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీలలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా చంద్రబాబు మరో ఘనత దక్కించుకున్నారు.

సమస్యల నడుమనే పాలన

అయితే, ఎన్నో సమస్యలు కొత్త ప్రభుత్వం ముందున్నాయి. ఒకటి పాలనపరమైన సమస్యలైతే.. రెండోది ఆర్థిక సమస్యలు. గత ప్రభుత్వ తప్పిదాలను లోటుపాట్లను త్వరగా సమీక్షించి కాలయాపన చేయకుండా కార్యాచరణకు దిగాలి. బడ్జెట్ తయారీ, రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం, పోలవరం నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదలపై ప్రాధాన్యత క్రమంలో ముందుకు సాగాలి. మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించాలి. పారదర్శక పరిపాలన అందించాలి. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరిచేందుకు సీనియర్ల సేవలను వినియోగించుకోవాలి. పార్టీలో కూడా సంస్థాగత మార్పులు రావాలి. హోదా సేవ కోసమే తప్ప.. స్టేట్‌ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామని చంద్రబాబు వాఖ్యలు గమనిస్తే అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసే ప్రభుత్వం అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కక్ష సాధింపులు ఉండవని అలాగని తప్పు చేసిన వారిని అధికారులను ఉపేక్షించేది లేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు అధికారుల్లో గుబులు పుట్టిస్తునాయి.

అభివృద్ధి పథంలో రాష్ట్రం పరిగెడుతుందని..

నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు డీఎస్సీపైనే తొలి సంతకం చేశారు. ఎందుకంటే 'టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే' అని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం. పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచుతూ మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేశారు వీటి ప్రాధాన్యతను గమనిస్తే అభివృద్ధి సంక్షేమంపై కొత్త ప్రభుత్వ దృక్పధాన్ని, లక్ష్యం దిశగా పనిచేయాలన్న ఆశయాన్ని ప్రస్ఫుటింపజేస్తున్నాయి. ప్రభుత్వం మారినంత మాత్రాన విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్లను ఆపొద్దని, వాటిని యథావిధిగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. వాటిపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నప్పటికీ యథావిధిగా పంపిణీ చేయాలని ఆదేశించటంలో ప్రజాధనం వృధా చెయ్యం అన్నది సంకేతం ఇచ్చినట్టయింది. వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అన్నది చంద్రబాబు నమ్మకం. అనుభవజ్ఞుడు దార్శనికుడు ఈ నాయకుని హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పరుగెడుతుందని ఆంధ్రుల విశ్వాసం నమ్మకం.

- వాడవల్లి శ్రీధర్

99898 55445

Advertisement

Next Story

Most Viewed