- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దివాలా స్థితిలో దాయాది దేశం
మన దాయాది దేశం పాకిస్తాన్ పూర్తి దివాలా స్థితికి చేరుకుంది. తక్కువ ఆదాయంతో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఆహార ధాన్యాల కొరత విపరీతంగా ఏర్పడి ద్రవ్యోల్భణం 42 శాతానికి పెరిగింది. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోధుమపిండి తదితర ఆహార ధాన్యాలు, వస్తువులపై పాకిస్తాన్ సబ్సిడీ ఎత్తివేసింది. దీంతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేక పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. దేశంలో ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి పాకిస్తాన్... సహాయం కోసం ఐక్యరాజ్య సమితి తలుపు తట్టడంతో పాటు ఆర్థిక సాయం చేయమని ఇతర దేశాలని అభ్యర్థించింది. ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్‌లు పాకిస్తాన్‌కి 800 కోట్ల డాలర్లను దశలవారీగా సహాయం చేయడానికి అంగీకరించాయి. అలాగే పాకిస్థాన్ ప్రధాని షాబాద్ షరీఫ్ గల్ఫ్ దేశాల సహాయం కోరగా సౌదీ అరేబియా కొంత ఆర్థిక సహాయాన్ని అందించింది.
వారి జోక్యం ఎక్కువవడంతో
పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితికి కరోనా, ఆ తరువాత అస్థిరత వరదలు, విపత్తులే కారణం. గతంలో మన పొరుగు దేశమైన శ్రీలంక ఈ పరిస్థితిని ఎదుర్కొంది. అక్కడ ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. దీంతో అక్కడి ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఆర్థిక పరమైన చర్యలు సక్రమంగా నిర్వహించడంతో ఆ దేశ పరిస్థితి కొంచెం కుదుటపడి ఆర్థికంగా ఇప్పుడిప్పుడే గట్టెక్కుతుంది. ఇప్పుడు పాకిస్థాన్‌లోను అదే పరిస్థితి ఏర్పడింది. అయితే పాకిస్థాన్‌కి ఇతర దేశాలు అనుకున్నంతగా సాయం చేయడం లేదు. కారణం... అక్కడ సుస్థిర పరిస్థితి లేకపోవడంతో పాటు ఉగ్రవాదం, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితులే పాకిస్థాన్‌ను ఇతర దేశాల నుంచి దూరం చేస్తున్నది. ఆ దేశంలో ఉగ్రవాదులకు షెల్టర్ ఇవ్వడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఉగ్రవాదులను ఇతర దేశాలపై ఉసిగొల్పడం వంటి చర్యలు ఆ దేశానికి ముప్పుగా పరిణమించాయి. అమెరికా దేశం పాకిస్తాన్‌ను ప్రమాదకరదేశంగా ఎప్పుడో వర్ణించినా ఆ దేశంలో ఉగ్రవాదం పరంగా ఎలాంటి మార్పు రాలేదు. అంతేకాక అక్కడి ప్రభుత్వంలో మిలటరీ జోక్యం ఎక్కువై మొన్నటి వరకు ప్రభుత్వం నడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. తర్వాత అక్కడ షాబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో సైనిక జోక్యం కారణంగా ఎన్నో ప్రభుత్వాలు పడిపోయాయి. ప్రధానులు, అధ్యక్షులు హత్యకు గురయ్యారు. ఆర్థిక, రాజకీయ అస్థిరత్వం వల్లే పాకిస్థాన్ కు సహాయం చేయడానికి ఏ దేశాలు ముందుకు రావడం లేదు.
దానికే నిధులు కేటాయిస్తూ
ఆర్థికంగా చితికిపోవడంతో అక్కడి ప్రభుత్వాలు ప్రజల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మైనారిటీల పరిస్థితి దయనీయంగా ఉండి అన్నపానీయాల కోసం అలమటిస్తున్నారు. వారిపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నది. దీంతో పీఓకే ప్రజలు ముఖ్యంగా కిల్గిట్ బెలూచిస్తాన్ ప్రజలు తమను భారత్‌లో కలపాలని ఆందోళన చేస్తున్నారు. పాకిస్థాన్ ఆర్థిక స్థితిని మనదేశం మౌనంగా గమనిస్తున్నది. ఇప్పుడున్న ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఆ దేశానికి చైనా దేశం ఒక్కటే ఆశాదీపం. ఇప్పటికే ఆ దేశానికి చైనా వేల కోట్ల డాలర్లు అప్పు ఇవ్వడమే కాకుండా కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల అప్పుల వడ్డీలు కట్టడానికే ఆ దేశానికి దాదాపు 30 బిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇంతటి కటిక పరిస్థితుల్లో దేశం ఉండటంతో మానవతా దృక్పధంతో సహాయం చేయాలని కోరుతున్నది.
పేరుకే అణ్వస్త్ర దేశమైనా, ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేయడంలో పాకిస్థాన్ ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. మితిమీరిన సైనిక జోక్యంతో పాటు అనవసరంగా కాశ్మీర్ సమస్యను ముందేసుకుని పాకిస్తాన్ ఆర్థికంగా చితికిపోతుంది. పాకిస్థాన్‌లో సింహభాగం నిధులు రక్షణ రంగానికే కేటాయిస్తున్నది. దీంతో ప్రజలకు మౌలిక వసతుల కల్పన జరగక ప్రజల ప్రశాంత జీవనానికి అవకాశం లభించడం లేదు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి మెరుగుపడాలంటే ఆ దేశం ఉగ్రవాదంపై దృష్టి పెట్టాలి. ఉగ్రవాదులను పెంచి పోషించినంత వరకు బయటి దేశాల నుండి పాకిస్థాన్ కు ఎలాంటి సాయం అందదు. ప్రపంచంలో ఆ దేశం ఎన్నో కూటములలో సభ్య దేశంగా ఉన్నా మిలిటరీ సాయం తప్ప ఇతర రంగాలలో ఆర్థిక సహాయం అందించడం లేదు. ఒక చైనా మాత్రం తన చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ కారణంగా పాకిస్థాన్‌లో అనేక పెట్టుబడులు పెడుతోంది. పాకిస్తాన్ ఆర్థిక, సామాజిక భద్రతకు హామీ ఇవ్వడంలో, ప్రజలకు శాంతియుత జీవితం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
శ్రీనర్సన్
8328096188
Also Read....
అరేంజ్డ్ మ్యారేజీలకు మొగ్గు చూపుతున్న యువత