భారత్‌ని తక్కువ అంచనా వేయొద్దు!

by Ravi |   ( Updated:2024-10-19 00:45:50.0  )
భారత్‌ని తక్కువ అంచనా వేయొద్దు!
X

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రవర్తనా తీరు భారతదేశంతో కెనడా దేశ దౌత్య సంబంధాలను పూర్తిగా దిగజార్చిందని చెబితే సత్య దూరం కాదేమో! ఆ తీరును పరిశీలిస్తే-అమెరికా నిఘా విభాగం సిఐఏ ఆడిస్తున్న ఆటలో ఆయన ఆట బొమ్మగా మారినట్లు స్పష్టం అవుతుంది. ఖలిస్తాన్ ఏర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను 2023 జూన్ 18లో కెనడాలోని టొరంటో నగరంలో ఎవరో హత్య చేశారు. ఈ హత్య భారత ప్రభుత్వ ప్రమేయంతో జరిగిందని నిరాధార ఆరోపణలను జస్టిన్ ట్రూడో అంతర్జాతీయ మీడియా ముందు ప్రకటించడం అసాధారణ విషయం. ఆయన ప్రకటనపై అమెరికా సపోర్టుగా మాట్లాడం పలు అనుమానాలకు దారితీసింది.

భారతదేశంలో జాతీయవాద ప్రభుత్వం కేం ద్రంలో అధికారంలో ఉండడం అమెరికా ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. మోడీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారతదేశంలోని ఎన్జీవోల ద్వారా దుష్ప్రచారాన్ని అమెరికా ప్రభుత్వ సంస్థలు, మోడీ వ్యతిరేక ప్రతిపక్షాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. తెరచాటుగా అమెరికా చేసే ప్రయత్నాలను మోడీ ప్రభుత్వంలోని వ్యూహకర్తలు పటాపంచలు చేయడం అమెరికా ప్రభుత్వానికి, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఎన్జీవోలకు మింగుడు పడని వి‌షయం. భారతదేశంలో రైతు ఉద్యమానికి మ‌ద్దతుగా సిక్కు ఏర్పాటు వాద సంస్థలు, జార్జ్ సో‌రోస్ ద్వారా నడపబడే అంతర్జాతీయ ఎన్జీవో లు నిలిచిన విషయం దేశ ప్రజలకు తెలుసు.

కెనడా సిక్కుల వలలో ట్రూడో

కెనడాలో ట్రూడో ప్రభుత్వ మనుగడకు సిక్కు ప్రజలు, ప్రతినిధుల మద్దతు చాలా అవసరం. ప్రపంచంలో అత్యధికంగా సిక్కులు ఉండే దేశం కెనడా. ఆ దేశంలో ఎవరు ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నా అక్కడ నివసిస్తున్న సిక్కుల మద్దతు చాలా అవసరం. రైతు ఉద్యమం వెనుక సిక్కు ఏర్పాటు వాద శక్తులు బలంగా పనిచేస్తున్నాయనేది వాస్తవం. రైతు ఉద్యమం ముసు గులో 2022 రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటపై ఖలి స్తాన్ జెండా ఎగరవేయడం, 62 మంది పోలీసు ల తలలు పగలగొట్టడం ఈ శక్తుల పనే. దీనిని దృష్టిలో ఉంచుకొని, కెనడా ప్రధాని రైతు ఉద్యమకారులకు మద్దతుగా మాట్లాడడం భారత అంతర్గత వ్యవహారాలలో వేలు పెట్టడమే!

ఎన్డీఏ ప్రభుత్వాన్ని తేలిగ్గా చూస్తే..

వాస్తవంగా అమెరికా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చేత ఆడించబడుతున్న కెనడా ప్రధాని ట్రూడో భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేయడం పెద్ద తప్పిదం. ఈ తప్పిదంలో భాగంగానే నిజ్జర్ హత్యపై భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ఇటీవల ఆరుగురు భారత దౌత్య అధికారులను బహిష్కరించడం. అమెరికా ప్రభుత్వం జస్టిన్ ట్రూడోను భారతదేశానికి వ్యతిరేకంగా నిలపడం, బంగ్లా దేశ్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చడానికి సహకరించడం, అక్కడ మత ఛాందసవాదులతో చేతు లు కలిపి, హిందువులపై దాడులు చేయించడం వెనుక ఆ దేశ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ఆయిల్ లాబీయింగ్‌ను మో‌డీ ప్రభుత్వం తృణీకరించడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితిని భారతదేశానికి అనుకూలంగా మలచుకుని, అమెరికన్ డాలర్ స్థానంలో భా‌రత్ రూపాయి మారకంతో రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం భారతదేశ ఆర్థిక అభివృద్ధికి పరిపుష్టిని కలిగించే విషయమే. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం చేసిన కృషిని మోడీ వ్యతిరేక రాజకీయ పక్షాలు, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా, దేశ వ్యతిరేక ఎన్జీవోలు ఒప్పుకోవు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

ఈ చిలకపలుకుల లక్ష్యం ఏమిటి?

మోడీని వ్యతిరేకించే అన్ని శక్తుల అసలు లక్ష్యం భారతదేశంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించ డం, అమెరికా అంతర్జాతీయ రాజకీయాలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడం. కాంగ్రెస్ నాయకుడైనా రాహుల్ గాం ధీని అమెరికాకు రప్పించడం, భారతదేశంలో మైనారిటీల జీవించే హక్కులను మోడీ ప్రభు త్వం కాలరాస్తుందని, సిక్కు ప్రజలు తలపాగాను, చేతికి కడియాన్ని ధరించడానికి కూడా భారతదేశంలో హక్కు లేదని, భారత ప్రభుత్వ సంస్థలు ప్రజాస్వామ్యయుతంగా నడవడం లే‌దని అంతర్జాతీయ మీడియా ముందు చిలుక ప‌లుకులు పలికించడం అమెరికా ప్రభుత్వం పనే. ఈ దేశం నాది, ఈ దేశానికి నేను వారసున్ని అనే భావన ఉన్న జాతి హితైషులందరికీ అమె‌రికా కుట్రపూరిత ఆలోచనలు బాగా తెలుసు! ఇక ఓటును అమ్ముకునే ఓటర్లకు మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఎరుక లేదు.

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Advertisement

Next Story

Most Viewed