పేద రెడ్లకు కార్పొరేషన్..

by Ravi |   ( Updated:2024-03-15 00:46:18.0  )
పేద రెడ్లకు కార్పొరేషన్..
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద రెడ్ల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో గత కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్న రెడ్డి సంఘాల వినతులను పరిగణనలోకి తీసుకొని, రెడ్డి సామాజిక వర్గంలో గల పేదవారికి ప్రభుత్వం చేయూత కల్పించే విధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయించడం హర్షణీయం. రాజ్యాంగం అమలు దగ్గర నుండి రెడ్లను అగ్రవర్ణాలు అనే ముద్ర వేసి, ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, సేవ రంగాలకు దూరం చేస్తూ వచ్చాయి. కానీ, ప్రభుత్వం ఏర్పాటు అయిన 100 రోజుల లోపు రెడ్లలో ఉన్న పేదల పరిస్థితి గుర్తించి, ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటించడం అభినందనీయం.

గత కొన్నేళ్లుగా ఎన్నో పోరాటాలు జరిపినా, మా వినతి పత్రాల మీదనే మా గోస ఆగిపోయింది. రెడ్లలో ఉన్న పేదలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, అధికారులు, అనధికారులూ.. ఇలా ప్రత్యక్ష, పరోక్ష సహాయం, సహకారం అందించిన వారికి మా కృత్ఞతలు. కొన్నేళ్లుగా గ్రామ స్థాయి నుండి, రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో పేదల హక్కుల కోసం పోరాడుతున్న రెడ్డి ప్రజాప్రతినిధులకు, రెడ్డి సంఘాలకు, ఎన్నో పోరాటాలు సల్పిన పోరాట వీరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెడ్ల తరపున కృతఙ్ఞతలు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెడ్లు అండదండగా ఉంటారని పేద రెడ్డి బంధువుల తరపున మాట ఇస్తున్నాము.

మరో చిన్న విన్నపం ఏమిటంటే ఈ కార్పొరేషన్‌ను చట్టబద్ధతతో కూడినటువంటి 5000 కోట్లతో ఏర్పాటు చేయాలని, అర్హులైన ప్రతీ నిరుపేద రెడ్డి బంధువుకు ఈ కార్పోరేషన్ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. చివరగా రెడ్డి సంఘాలకు, రెడ్డి విద్యావంతులకు మా విన్నపం ఏమిటంటే ఎందరో గ్రామీణ ప్రాంత రెడ్డి బంధువులు ఈబీసీ / ఈడ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేసుకునే విధానాన్ని, తద్వారా కార్పోరేషన్ ద్వారా అందుకోగల సహాయాన్ని గురించి తెలియజేయండి. మీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ద్వారా ప్రతీ రెడ్డి బంధువుకు ఈ విషయం తెలిసే విధంగా ప్రచారం చేయగలరు.

-కొలను వెంకటేశ్వరరెడ్డి

రిటైర్డ్ ఎస్పీ

80960 95555

Advertisement

Next Story