- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పరవాలేదనిపించే ‘బెదురులంక’
కాగితం పైన కథలలోని సందేశాలు అద్భుతమనిపిస్తాయి. తెరమీదకొచ్చేసరికి తేలిపోతాయి. ఇందుకు తెర వెనుక, ముందు అనేక ‘సాంకేతిక కారణాలు ఉంటాయి. ఏది ఏమైనా చివరాఖరున ఆదరించవలసినది, అర్థం చేసుకొని ఆనందించవలసినది ప్రేక్షకులేననేది నిజం. 2012లో యుగాంతం జరిగిపోతుందని కొంతమంది భయపడ్డారు. మతాధికారులు, పీఠాధిపతులు ప్రజల భయం, బలహీనతల పైన ఆ రోజుల్లో బాగానే వ్యాపారం చేసుకున్నారు. కరోనాలాగా 2012 కూడా ‘దోచుకున్న వారికి దోచుకున్నంత’ని స్వార్థపరులైన వారికి చేయూతనిచ్చింది. కాకపోతే... ఆ కాలంలో ఈ పాయింట్ ని ఎక్కువమంది సరదాగా తీసుకొని ‘సీరియస్’గా గమనించారు. ‘బెదురులంక 2012’ చిత్రం కథలైన్ ఇదే..
ఇలా చేస్తే ఇంకా బాగుండేది..
‘బెదురులంక 2012’ చిత్రం గురించి ఎందుకు సమీక్షించుకోవాలంటే మానవ ముసుగులు ధరించిన జనం బాగుకోసం పాటుపడతామని 'ఇదయి' పోయే వారంతా నిజంగా ఆ విధంగా చేయరనేది జనాలకు తెలుసు. తెలిసినా మోసపోతుంటారు. బలహీనత ‘బలవంతుడి’ ఆయుధం ‘2012. బెదురులంక’ అనే గ్రామంలో ప్రెసిడెంట్, అతని బావమరిది కలిసి యుగాంతం భయాన్ని ‘క్యాష్’ చేసుకుందాం అనుకుంటారు. ఇందుకు బ్రహ్మం, డేనియల్ లను వాడుకుంటారు. వారు మతం, జ్యోతిష్యం ముసుగులో జనాల్ని ఎలా బోల్తా కొట్టించారనేది ప్రధాన కథ. శివ,అతని ప్రియురాలు చిత్ర (ప్రెసిడెంట్ కూతురు) చిత్రం కథానాయక నాయకులు. వీరు మొత్తం ఈ వృత్తాంతమును జనాలకు ఎలా తెలియజేసి చైతన్యపరిచారనేది రెండో భాగంలోని కథ.
కథలో వాస్తవాలకు అద్దం పట్టే సన్నివేశాలు ఉన్నాయి. కానీ.. వాటిలో బలం తక్కువ. కొన్ని సన్నివేశాలు ‘రిపీటెడ్’ గా కనిపిస్తాయి. ముఖ్యంగా గెటప్ శ్రీను ఉన్నది. అశ్లీల సంభాషణలు కూడా ఉన్నాయి. చిత్రంలో చూపించిన విధంగా జనాలు మరీ అమాయకులు కారనేది ఓ లాజిక్. కామెడీగా సరి పెట్టుకోవాలని దర్శకుడి అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ… సహజతకు దగ్గరగా వస్తూనే ‘లాజిక్’ మిస్ అయిన సన్నివేశాలు చిత్రీకరణ వెనుక ‘కామెడీ’ కుదరదని సినీ విమర్శకుల అభిప్రాయం.
దర్శకుడు ‘క్లాక్స్’ కు స్పార్క్ ఉంది. కథ కూడా ప్రస్తుత తరం ప్రేక్షకులకు కొత్తదే. కాకపోతే సంభాషణలు అక్కడక్కడ చురుక్కుమనిపిస్తాయి. ఈ రకమైన శ్రద్ధ మొత్తం చిత్రం అంతా కనిపింపజేసి ఉంటే ‘బెదురులంక 2012’ చిత్రం రిజల్ట్ ఇంతకన్నా బాగుండేది. చిత్రంలో చాలా సన్నివేశాలకు తగిన వాతావరణం కల్పిస్తూ కెమెరా పనితనం బాగుంది. ఇందుకు సాయి ప్రకాష్ ఉమ్మడి సింగ్, సన్నీ కూరపాటీలు అభినందనీయులు. సంగీతం మణిశర్మ. ఒకట్రెండు పాటలు పరవాలేదనిపిస్తాయి. ముఖ్యంగా రీ రికార్డింగ్ ఎన్నో సాంకేతికమైన లోపాలు ఉన్నాయి. మరింత శ్రద్ధ అవసరమేమోనని థియేటర్ సామాన్యులు సైతం తెలుసుకోవడంతో మణిశర్మ ముందు ముందు చిత్రాల్లో ఆలోచించుకోవాలి. నిర్మాత రవీంద్ర బెనర్జీ బడ్జెట్ పరిధిలో చిత్రాలు నిర్మించడం కష్టమని తెలుసుకొని ఉంటారు.
కథలో మానవీయ కోణం ఉండాలి..
నటీనటుల విషయానికొస్తే కార్తికేయ, నేహా శెట్టి లు పాత్ర పరిధిని దర్శకుడు ఖచ్చితంగా తీర్చిదిద్దుకోలేదు. అయినా తన పరిధిలో కార్తికేయ తనవంతు తాను చేశాడని చెప్పాలి. హీరోయిన్ నేహా శెట్టి పాత్ర ‘అన్ని తెలుగు చిత్రాల’లో ఓ మాదిరిగా నటించింది. మమ అనిపించింది. ప్రెసిడెంట్ పాత్ర పోషించిన గోపరాజు రమణ మాత్రం ఉన్నంతలో బాగానే చేశారనేది నిజం. సత్య వెన్నెల కిషోర్ అతిథి పాత్రలో మెరిశారు. మెప్పించలేకపోయారు. అసలు ఎందుకు ఉందో తెలియని పాత్రను గొప్ప నటుడు, రచయిత అయిన ఎల్బీ శ్రీరామ్ పోషించారు. దర్శకుడు ఈ పాత్ర నిర్మాణంలో పూర్తిగా అన్యాయం చేశాడు. మరికొన్ని రోజుల్లో చనిపోతామని తెలిసిన మనుషులు జీవితాన్ని ‘అనుభవించాలి’ అనుకోవడం సహజం. అనుభవించడం అంటే తాగి తందనాలు ఆడటమే అనే సూత్రాన్ని వర్తమాన చిత్రాలు బలంగా ప్రేక్షకులకు చెబుతున్నాయి. ఇందుకు ‘బెదురులంక’ మినహాయింపు కాదు. అనేకానేక సన్నివేశాలు కొనసాగాకే హాస్యం అనేది తనకు తానే ప్రేక్షకుడు అలవాటు చేసుకుంటాడు. నవ్వే ప్రయత్నం చేయడానికి అవసరమైన సంభాషణలు చిత్రంలో ఉన్నాయి.
కొన్నాళ్ల క్రిందట 'స్కైలాబ్' అనే సినిమా వచ్చింది. అది భూమిపై పడుతుందనే వార్తలతో ప్రపంచమంతటా భయోత్పాతం కలిగింది. ఈ సంఘటనను ఆధారం చేసుకుని మతం, జ్యోతిష్యం సహాయంతో బలవంతుడు (ధనం వలన) ఆడే ఆటలో జన సామాన్యం పావులుగా మారారు. 'బెదురులంక 2012' కథను కూడా దర్శకుడు అదే అలవరసలలో అల్లుకున్నారు. కానీ ఆ సినిమా ఓటీటిలో విజయవంతం అయింది. 'బెదురులంక' సంగతి చెప్పలేం. మతం, జ్యోతిష్యం పేరుతో జనాలు మోసపోతున్న మాట వాస్తవం. ప్రజలు అమాయకులు కాదు. అలాగని తెలివైన వారు కూడా కాదు. బలమైన వారు మోసం చేస్తుంటారు. వారికి ప్రకృతి వైపరీత్యాలు, హఠాత్తు సంఘటనలు, ‘సంపాదనావకాశాలు’ ఎవరో ఒకరు వచ్చి, మోసం చేసేవారి ముసుగులు తీస్తే చివరికి అంతా ఏమిటనేది కథగా బాగుంటుంది. కానీ ఎన్నడో గడిచిన భయోత్పాత సంఘటనలను తెరమీద ఆవిష్కరించాలంటే వాటిలోని మానవీయకోణం ఆవిష్కరించాలి. ఆ మధ్య వచ్చిన '2018' మలయాళ చిత్రం చేసిన పని ఇదే. అందుకే విజయం దక్కించుకుంది. కమర్షియల్ పాయింట్స్ మిస్ అవ్వకుండానే ప్రకృతి వైపరీత్యాలను చిత్రించి ప్రేక్షకులను మెప్పించవచ్చు. ఈ పాయింట్ బలహీనమైతే కొంత నవ్వుకొని, మరికొంత నిరాశ పడి ప్రేక్షకులు ‘ఓటీటీ’లో ఈ చిత్రం పరవాలేదు అనుకోని బయటికి వెళ్తారు.’ బెదురులంక -2012’ చిత్రం చెప్పే సత్యమిదే
- భమిడిపాటి గౌరీశంకర్
94928 58395