- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టపాసుల కాల్చడంలో జాగ్రత్తలు పాటించండి..
ప్రపంచాన్ని అబ్బురపరిచే భారతీయ పండుగలలో అతిముఖ్యమైనది దీపావళి. ఇది దేశ సంస్కృతి, ఖ్యాతిని పెంచే పండుగ. చెడుపై మంచిని సాధించిన గుర్తు ఈ పండుగ. ఈ పండుగకు టపాసులు కాల్చడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ తక్కువ మోతాదులో టపాసులు కాల్చండి. ఎందుకంటే మనిషి మనుగడ ప్రకృతిమీద ఆధారపడివుంది. కాబట్టి మన ఉనికికి ఆధారమైన ప్రకృతిని కలుషితం చేసే హక్కు మనిషికీ లేదు. టపాసులలో వచ్చే కాలుష్యం మనిషి పిలిచే గాలిని కలుషితం చేస్తుంది, నీళ్లు కలుషితంగా మారుతాయి. కాబట్టి తక్కువ ధ్వనులు వచ్చే టపాసులను, తక్కువ కలుషితాన్ని విడుదల చేసే టపాసులను కాల్చండి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇక పెద్ద టపాసులు చిన్న పిల్లలచేత కాల్పించకండి, టపాసులు కాల్చే సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ కిట్లను దగ్గర ఉంచుకోండి. వాహనాలు వెళ్లే దారిలో, ప్రజలు నడిచే దారిలో టపాసులు కాల్చకండి. దగ్గరలో ఉన్న ఖాళీస్థలం లేదా గ్రౌండ్లలో కాల్చడం వలన ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ధ్వని కలిగించే టపాసులు కాల్చడం వలన చిన్నపిల్లలకు చెవుడు వచ్చే ప్రమాదం ఉంటుంది. టపాసులు కాల్చినప్పుడు వచ్చే పొగకి దూరంగా ఉండండి. మరీ ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు ఈ టపాసులకు దూరంగా ఉండాలి. మూగజీవాలు ఉన్నచోట టపాసులు పేల్చడం వలన అవి భయబ్రాంతులకు గురై ఎదుటివారిపైనా దాడి చేసే అవకాశం ఉంటుంది. కావున వాటికి దూరంగా కాల్చండి. చిన్న ఏమరపాటుతో ఉన్నా అతిపెద్ద ప్రమాదాలు జరుగుతాయి. జీవితాలను కోల్పోవలసి కూడా వస్తుంది. గంతో అనేక సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. టపాసులు కాల్చడం కన్నా దీపాలతో మీ ఇంటిని అలంకరించుకోండి. చాలా ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఎదుటివారిని కాపాడుతాయి.
- డాక్టర్. వై. సంజీవ కుమార్
స్కై ఫౌండేషన్, ప్రెసిడెంట్
93936 13555
- Tags
- Diwali Crackers