- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘అపార్’కి అరుదైన గౌరవం..
దేశంలో పలు ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అధికారిక ఎంట్రీగా ‘అపార్’ లఘు చిత్రం ఎంపికయ్యింది. అనేక ఏళ్లుగా ప్రభుత్వాలూ స్వచ్ఛంద సంస్థలూ నిర్వహిస్తున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి 'అపార్' ఎంపిక కావడం అభినందిచాల్సిన విషయం.
ఇస్రోలో ఉద్యోగం కాదనుకుని..
ఈ ‘అపార్’ చిత్రానికి తెలంగాణాకు చెందిన అన్వేష్ వారాల డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ నిర్వహించాడు. కరీంనగర్ పట్టణానికి చెందిన అన్వేష్ వారాల మొదట కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏవియానిక్స్ చదివాడు. ఇస్రోలో ఉద్యోగాన్ని కాదనుకుని తనకున్న ఆసక్తి మేరకు సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ లో పీజీ కోర్స్ ఇన్ సినిమాటోగ్రఫీ చదివాడు. ఈ ఇన్స్టిట్యూట్‌లో నిర్మించిన ‘అపార్' ఉత్తర్ ప్రదేశ్‌లో నిర్వహించిన ‘జాగరన్' ఫిల్మ్ ఫెస్టివల్‌కు అధికారిక ఎంట్రీగా ఎంపికై ‘దర్భంగా’, ‘బరెల్లీ’, ‘వారణాసి’ నగరాలల్లో ప్రదర్శించబడి విశేష ప్రశంసలను అందుకుంది. తర్వాత బెంగళూరులో నిర్వహించిన ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘బెంగళూరు క్వీర్ ఫిల్మ్ ఫెస్టివల్ 23 కి ఎంపికయింది.
మంచి సినిమానే జీవిత లక్ష్యం
ఈ ఫెస్టివల్‌లో అనేక జాతీయ అంతర్జాతీయ సినిమాల్ని ప్రదర్శించారు. ఇంకా అపార్ చిత్రం 28వ అంతర్జాతీయ కోల్‌కత్తా ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా అధికారిక ఎంట్రీగా ప్రదర్శించబడింది. ఇట్లా సినిమాటోగ్రాఫర్‌గా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న అన్వేష్ వారాల ఇప్పటివరకు ‘పట్నం’ బతుకే కల’ లాంటి పలు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో వున్న సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో కోర్సు పూర్తి చేసుకుని మంచి సినిమాలకు, సాంకేతిక విలువలతో నిర్మించే సినిమాలకు కెమెరా వర్క్ చేయడమే తన లక్ష్యమంటున్నారు.
15 నిమిషాల నిడివి గల ఈ ‘అపార్’ షార్ట్ ఫిలిం లెస్బియన్ సమస్య మీద రూపొందించబడింది. ఈ లఘు చిత్రంలో మధ్యమ హల్దార్, రాజా చక్రవర్తి, అర్పితా డే తదితరులు నటించగా అభిసోన్ యుమ్నం దర్శకత్వం వహించాడు, కథా కథనం శృతి పార్థసారథి, సినిమాటోగ్రఫీ వారాల అన్వేష్, ఎడిటింగ్ అంకిత్ ప్రకాష్, ఆర్ట్ స్వరాజ్ సిద్దార్థ్, నిర్మాణం ప్రధమేష్ నిర్వహించారు.
ఈ షార్ట్ ఫిల్మ్‌తో పాటు 'నవాబి షోక్'కి లఘు చిత్రాలు అధికారికంగా 10వ ‘ఇండో-బంగ్లాదేశ్’ ఫిల్మ్ ఫెస్టివల్ 2023కి ఎంపిక చేయబడ్డాయి. సిలిగురి ఫిల్మ్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని 2023 అక్టోబర్ 6-8 తేదీల్లో నిర్వహించనున్నారు. అన్వేష్ తీసిన 'అపార్' లఘుచిత్రం ఇప్పటికే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో పాల్గొంది, ఇక సిలిగురి చిత్రోత్సవంలో సైతం అవార్డు రావాలని కోరుకుందాం.
- వారాల ఆనంద్
94405 01281