- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అన్నదాతకు అండగా ఆకాశవాణి
బహుజనహితాయా- బహుజన సుతాయ అన్నది ఆకాశవాణి ఆశయం. ఇది నెరవేరడానికి విద్య, వైద్య, విజ్ఞాన, వినోద కార్యక్రమాలతో పాటు, వ్యవసాయ కార్యక్రమాలు శ్రోతలకు అందించేందుకు కృషి చేస్తుంది. భారత దేశానికి వ్యవసాయం వెన్నెముక అని గుర్తించి, రేడియో గ్రామీణులకు సమాచారం చేరవేసే ప్రధాన మాధ్యమం కాబట్టి, 1966లో అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి భారతరత్న సి.సుబ్రహ్మణ్యం ఆకాశవాణిలో సాగుబడి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాటి నుంచి వ్యవసాయ కార్యక్రమాలకు తన ప్రసారాల్లో ముఖ్య భాగం కల్పిస్తుంది. హరిత విప్లవ సమయంలో ఆకాశవాణి భూమిక విస్మరించలేనిది. ఆ సమయంలో ఒక కొత్త వంగడానికి రేడియో రైస్ అని పేరు పెట్టడం విశేషం. 1990 దశకం ప్రారంభం నుంచి స్థానిక రేడియో కేంద్రాలు సైతం వ్యవసాయ కార్యక్రమాలకు పెద్దపీట వేశాయి. 2004 నుంచి ఫిబ్రవరి 15న కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేవలం 12 రేడియో కేంద్రాల్లో కిసాన్ వాణి కార్యక్రమాలు ప్రారంభించగా, అందులో ప్రతిభ కలిగినటువంటి, నిష్ణాతులైనటువంటి రైతులను గుర్తించి, ప్రతి సంవత్సరం వారికి సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నాయి ఆకాశవాణి కేంద్రాలు.
ఆకాశవాణి కేవలం స్టూడియో కార్యక్రమాలకే పరిమితం కాకుండా, గ్రామాలకు కిసాన్ వాణి ప్రతినిధులను పంపించి, రైతుల అనుభవాలను, సమస్యలను రికార్డు చేసి రేడియోలో ప్రసారం చేస్తుండడంతో, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు కూడా జిల్లా వ్యాప్తంగా ప్రసారమయ్యేట్టుగా చూస్తున్నాయి. రైతాంగం ఈ కార్యక్రమాలను విని ప్రయోజనం పొందుతూ వ్యవసాయానికే పరిమితం కాకుండా పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, పండ్లతోటలు, కూరగాయల సాగు, మత్స్య పరిశ్రమ తదితర అనుబంధ రంగాలపై సమగ్ర సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తుంది ఆకాశవాణి. రైతు సోదరుల అనుభవాలతో పాటు రోజు వాతావరణ శాఖ అందించే వివరాలు, వ్యవసాయ మార్కెట్ వారు తెలియజేసే ధరల వివరాలు, సాగు పాఠాలు, ఈ కిసాన్ వాణి కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయి. రేడియో కేంద్రం పనిచేసేటటువంటి జిల్లాలోని రైతులు పంటల నుంచి అధిక దిగుబడులు సాధించేందుకు ఆకాశవాణి కేంద్రం వారు ప్రత్యేకంగా రైతుల కోసం ఉదయం వేళ పొలం కబుర్లు, సాయంత్రం వేళ కిసాన్ వాణి, కర్షక లోకం వంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను విని తన సొంత వ్యవసాయ భూముల్లో అధిక దిగుబడులు సాధించే పంటలను పండిస్తూ, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్షక లోకం శీర్షికన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు, ఉద్యాన వన శాఖ అధికారులు, ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల సలహాలు, సూచనలను ఇంటర్వ్యూల ద్వారా, వ్యవసాయ క్షేత్రాల పరిశీలన ద్వారా రైతులకు చేరవేస్తూ, రైతులలో అవగాహనను పెంపొందించి అధిక దిగుబడి సాధించే విధంగా కృషి చేస్తున్నాయి.
భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచార శాఖల సలహా మేరకు 19 ఏళ్లుగా రేడియో కిసాన్ దినోత్సవం నిర్వహిస్తూ ఎంపిక చేసిన ఉత్తమ రైతులను ఘనంగా సత్కరిస్తోంది. రేడియో కార్యక్రమాలు క్రమం తప్పకుండా వినడం, పంటల సాగులో సాంప్రదాయ, శాస్త్రీయ పద్ధతులను సమన్వయం చేసుకుంటూ, మెలకువగా వ్యవసాయ విధానం అనుసరించే వారిని గౌరవించడం వీరి ఉద్దేశమైతే, మహిళా రైతులకు సమ ప్రాధాన్యాన్ని ఇవ్వడం మరో ప్రధాన ఆశయం. ఆకాశవాణి ప్రతినిధులు సమర్పించే సమాచారంతోపాటు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అందించే సమాచారం ప్రాతిపదికగా ఉత్తమ రైతులను ఎంపిక చేస్తున్నారు. ఒక గ్రామంలో ఒకరికి మించి ఉత్తమ రైతులు ఉంటే వారిని తదుపరి సంవత్సరాలలో సత్కరిస్తూ, ప్రతి సంవత్సరం అన్నదాతకు అండగా నిలుస్తూ వారికి అవసరమైన సమాచారాన్ని ప్రసారం చేస్తూనే పంటల్లో అధిక దిగుబడులు వచ్చేలా సహకరిస్తున్నాయి ఆకాశవాణి కేంద్రాలు. అంతేగాక ప్రముఖుల సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించిన రైతులను గుర్తించి సన్మానిస్తోంది. ఈ విధంగా కిసాన్ వాణి, కర్షక లోకం కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయి. పంటల సాగులో అధిక దిగుబడులు సాధిస్తూనే ఉత్తమ రైతులను సన్మానించి వారికో గుర్తింపు నిస్తూ, వారికి అండగా నిలుస్తుంది ఆకాశవాణి.
(నేడు రేడియో కిసాన్ దివస్ సందర్భంగా...)
- మోటె చిరంజీవి,
తాత్కాలిక వ్యాఖ్యాత,
ఆకాశవాణి వరంగల్ కేంద్రం
99491 94327