క్వారంటైన్ కేంద్రంగా ఈడెన్ గార్డెన్స్

by Shyam |   ( Updated:2020-07-11 09:39:38.0  )
క్వారంటైన్ కేంద్రంగా ఈడెన్ గార్డెన్స్
X

దిశ, స్పోర్ట్స్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చారు. ఈ స్టేడియంలోని ఐదు బ్లాక్స్‌ను పోలీసుల కోసం క్వారంటైన్ సెంటర్‌గా మార్చినట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రకటించింది. నగరంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. భారీ సంఖ్యలో పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటి రకు 500 మంది పోలీసులకు కరోనా సోకగా, 400 మంది కోలుకున్నారు ముందు జాగ్రత్తగా పోలీసుల కోసమే ఈడెన్ గార్డెన్స్‌లోని ఈ, ఎఫ్, జీ, హెచ్, జే బ్లాక్స్‌ను క్వారంటైన్ కేంద్రంగా మార్చారు. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం ప్రారంభంకాక ముందు దేశంలోనే అత్యధిక ప్రేక్షక సామర్థ్యం కలిగి స్టేడియంగా ఈడెన్ గార్డెన్స్ రికార్డు సృస్టించింది.

Advertisement

Next Story

Most Viewed