- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CMKCR-Eatala Rajender: సంచలనం: టీఆర్ఎస్ నుంచి ఈ రాత్రికే ఈటల బహిష్కరణ..?
దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ముందుగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే ఈటలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రెండు రోజుల కిందటే ప్రకటించారు. అయితే ఢిల్లీకి వెళ్లి నాలుగు రోజుల పాటు పలువురు నేతలతో భేటీ అయిన ఈటల… గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అనంతరం పలువురు నేతలతో దీనిపై చర్చించినట్లు సమాచారం. దీనిలో భాగంగా ముందుగా టీఆర్ఎస్కు రాజీనామా చేయాలని ఈటల నిర్ణయం తీసుకున్నారని ఈటల వర్గంలో టాక్.
రాజీనామా క్రెడిట్ దక్కకుండా…!
గతంలో టీఆర్ఎస్కు రాజీనామా చేసేందుకు ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారంటే… ముందుగానే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేశారు. రాములు నాయక్‌తో పాటు పలువురు నేతల వ్యవహారంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఈటల అంశంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారనే క్రెడిట్‌ను వారికి దక్కకుండా ముందుగానే పార్టీ నుంచి తొలిగించినట్లు ప్రకటిస్తే ఇక ఏ పార్టీలో చేరినా తమకేం సంబంధం అనే రీతిలో టీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తోంది.
మరోవైపు ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు గతంలోనే తీర్మానం చేశారు. తీర్మానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు సంతకం చేశారు. ఈ లేఖపై మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, రసమయి, మాజీ ఎంపీ వినోద్ తదితరులు సంతకాలు కూడా చేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అందించిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారని ఉమ్మడి కరీంనగర్ నేతలు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇవ్వాళ రాత్రి వరకే ప్రకటన..?
ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు గురువారం రాత్రి వరకు టీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. బీజేపీలో చేరేందుకు ఈటల దాదాపుగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా కొంత అడ్వాన్స్‌గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. దీంతో గురువారం రాత్రి వరకే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన రానున్నట్లు పార్టీ నేతల్లో టాక్. అటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కూడా ఈటల రాజేందర్ ఏ పార్టీలో చేరే అంశం కూడా పూర్తి క్లారిటీ రానుంది.