- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హుజురాబాద్‌లో ఈటలకు ఘోర అవమానం.. షాక్‌లో బీజేపీ..!
దిశ, జమ్మికుంట: ఓ వైపు పాదయాత్రతో ప్రజల్లో మమేకం అయ్యే పనిలో నిమగ్నం అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఝలక్ ఇచ్చారు వీణవంక మండల దళితులు. మీరిచ్చిన గోడ గడియారాలు మాకొద్దని నేలకేసికొట్టారు. వాల్ క్లాక్‌లను రోడ్డుపై పెట్టి.. డప్పు కొట్టి, దరువేసి వాటిని పగలకొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎలాబాక, చల్లూరు, గ్రామాల్లోని దళితులు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై తమ నిరసనను వెళ్లగక్కారు. రాజేందర్ ఫోటోలు ఉన్న గోడ గడియారాలు రహదారిపై పారేసి ధ్వంసం చేశారు.
అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌ను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపొమ్మనలేదని.. ఆయనకు ఆయనే పార్టీ విడిపోయారని విమర్శించారు. రాజేందర్ తన సొంత లాభం, ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని దళితులు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని కొనియాడారు. ఈటల ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. తాము మాత్రం సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. వచ్చే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ రుణం తీర్చుకుంటామని ప్రకటించారు.