- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్సార్ టైటిల్‌ను కాపీ కొట్టిన ఈటల
దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రతిక్షణం వెంటనడిచిన మీకు అనుక్షణం అండగా ఉండడానికి, ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి, 22 రోజుల సుదీర్ఘ ప్రజా దీవెన యాత్రకు జూలై 19 నుంచి శ్రీకారం చుడుతున్నాను. రేపు ఉదయం 7.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుంచి ప్రారంభం అయ్యే ఈ ప్రజా పాదయాత్రకి మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులకు మీ అండదండలు కావాలి. నా ప్రస్థానానికి మీ ప్రేమాభిమానాలు కావాలి. ప్రజా దీవెన యాత్రకి మీ అందరి దీవెనలు కావాలి. ఆత్మ గౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు’ అంటూ ఈటల రాజేందర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు అనుసంధానంగా ఓ ఫొటోను కూడా అప్‌లోడ్ చేశారు ఈటల. అందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్ చిత్రం ‘యాత్ర’ టైటిల్‌ను కాపీ కొట్టారు. దీంతో సినిమా టైటిల్‌ను దించేశారని పలువురు చెప్పకనే చెబుతున్నారు. అంతేకాకుండా, ఈటల పాదయాత్రపై పలువురు నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ‘మీరు బీజేపీ జెండా పట్టారు, బీజేపీ ఏమి చేసిందో తెలంగాణ ప్రజల్లో క్లారిటీ లేదు, అది గ్రౌండ్ రియాలిటీ, నిర్మల సీతారామన్ ప్యాకేజీ ప్రజలకు ఎక్కడ ఉపయోగపడింది అనేది మీరు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పలువురు నెటిజన్లు మాత్రం ఆల్ ది బెస్ట్ చెబుతున్నా.. ‘మీది ప్రజా దీవెన యాత్ర కాదు నయవంచన యాత్ర అంటూ కామెంట్లు పెడుతున్నారు.
- Tags
- Eatala Rajender