రోశయ్య మరణం తెలుగు ప్రజానీకానికి తీరని లోటు : ఈటల రాజేందర్

by Shyam |
రోశయ్య మరణం తెలుగు ప్రజానీకానికి తీరని లోటు : ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ గవర్నర్, మాజీ సీఎం రోశయ్య ఉద్యమ సమయంలో ఎంతో సంయమనంతో వ్యవహరించేవారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఓయూ విద్యార్థులపై రబ్బరు బుల్లెట్లు కురిపించిన సమయంలో అర్ధరాత్రి వెళ్లి అపాయింట్‌మెంట్​అడిగినా ఇచ్చారని ప్రశంసించారు. ఎంతో సంయమనంతో పోలీస్​అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేసి అడ్డుకున్నారని ఈటల తెలిపారు.

అమీర్‌పేటలోని రోశయ్య నివాసంలో ఆయన పార్థివదేహానికి ఈటల నివాళులర్పించారు. రోశయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మీడియాతో వెల్లడించారు. 2004-14 వరకు ఎమ్మెల్యేగా రోశయ్యతో కలిసి పనిచేసే భాగ్యం లభించిందని తెలిపారు. ఆయన ఎంతో అపార అనుభవం కలిగిన వ్యక్తి అని కొనియడారు. అసెంబ్లీలో ఎవరు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పగలిగిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. రోశయ్య మరణం తెలుగు ప్రజానీకానికి తీరని లోటని తెలిపారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే చిదంబరం తెలంగాణ ప్రకటన చేశారని, ఆయన ఉపన్యాసాలు యువకులకు మార్గదర్శకంగా ఉంటాయని ఈటల రాజేందర్ కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed