ఇండియన్ సూపర్ లీగ్‌లోకి ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ

by  |
ఇండియన్ సూపర్ లీగ్‌లోకి ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ
X

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో వందేళ్ల చరిత్ర కలిగిన ఫుట్‌బాల్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ ఎట్టకేలకు ఇండియన్ సూపర్ లీగ్‌లోకి ప్రవేశించింది. రిలయన్స్ ఆధ్వర్యంలో మొదలైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఇప్పటికే ఇండియాలో మంచి ఆదరణ కలిగి ఉంది. ఇప్పటికే ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీకి చిరకాల ప్రత్యర్థి అయిన మోహన్ బగాన్ క్లబ్ ఐఎస్‌లో ఆడుతున్నది.

గతంలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ కూడా ఐఎస్ఎల్‌లో అడుగు పెట్టనున్నట్లు చెప్పారు. తాజా సీజన్ నవంబర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ తాము ఐఎస్ఎల్‌లో చేరనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ క్లబ్‌ను శ్రీ సిమెంట్స్‌ ప్రమోటర్‌లలో ఒకరైన మొహన్ భంగుర్ నిర్వహిస్తున్నారు. రెడ్ అండ్ గోల్డ్స్‌గా పేరొందిన ఈ క్లబ్ ఈ సారి అన్ని జట్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ ప్రవేశంతో ఐఎస్ఎల్‌కు సరికొత్త ఉత్సాహం వచ్చినట్లైంది.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed