- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక నిమిషానికి 59 సెకన్లా?
దిశ, వెబ్‌డెస్క్ : భూమి తనచుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందన్నది తెలిసిందే. అయితే భూమి తనచుట్టూ తాను ఒక‌్కసారి తిరిగేసరికి 24 గంటల సమయం పడుతుండగా, కొన్ని సంవత్సరాల నుంచి భూమి తిరిగే వేగం పెరిగిందని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. భూమి వేగంగా తిరుగుతుండటం వల్ల టైమ్ తగ్గుతుండటంతో, 2020లో ఏకంగా 28రోజులు అత్యంత వేగంగా గడిచినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సాధారణంగా భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగే సరికి 23 గంటల 56 నిముషాల 4 సెకండ్ల సమయం పడుతుంది. కానీ గత కొన్నేళ్లుగా భూమి చాలా వేగంగా పరిభ్రమిస్తున్న కారణంగా టైమ్ వేగంగా గడిచిపోవడమే కాకుండా రోజులో 24 గంటల సమయం కూడా తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో నిమిషానికి 60 సెకన్లలో మార్పు వచ్చే అవకాశం ఉండగా, ప్రస్తుతం ఉన్న టైమ్‌తో సింక్ చేయాలంటే అందుకు ఒక నిమిషం నుంచి 1 సెకన్‌ను తొలగించాల్సి అవసరం ఉందని సైంటిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. అయితే టైమ్‌ను ఇలా అడ్జస్ట్ చేయడం ఇదేం తొలిసారి కాదు.. సైంటిస్ట్‌లు గతంలోనూ ఓ సారి 1 మిల్లీ సెకన్ టైమ్‌ను అడ్జస్ట్ చేసిన దాఖలాలున్నాయి. అప్పుడే కంప్యూటర్లు, శాటిలైట్లు అన్నీ క్రాష్ అవగా.. ఈసారి ఏకంగా 1 సెకన్‌ను అడ్జస్ట్ చేస్తే, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. తద్వారా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సమస్యను వారు ఎలా పరిష్కారం చేస్తారో వేచి చూడాల్సిందే.
భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులతో పాటు చంద్రుడు భూమికి దూరంగా కదులుతుండటం.. వంటి కారణాలు భూమి వేగాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.