- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ ప్రయాణికులకు అనూహ్య షాక్.. బస్సు ఎక్కాలంటే ఇయర్‌ఫోన్స్ తప్పనిసరి
దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువ సౌండ్‌తో సంగీతం ప్లే చేయడం, సినిమాలు లేదా వార్తలు చూడటాన్ని నిషేధించింది. కర్నాటక హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. బస్సు ఎక్కిన ప్రయాణికులను ఫోన్‌ను మ్యూట్ చేయమని కండక్టర్ ముందుగా కోరాలని, అప్పటికీ ప్రయాణీకుడు మాట వినకపోతే, వారిని బస్సు నుండి దింపేయాలని, వారి బస్సు ఛార్జీని కూడా రిటన్ చేయలేరని కోర్టు తీర్పు చెప్పింది.
KS RTC పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ లత టీ.ఎస్ మాట్లాడుతూ “ప్రయాణికులు బస్సుల్లో ఎక్కువ సౌండ్‌తో సంగీతాన్ని ప్లే చేయడం వల్ల ఇతర ప్రయాణికులతో పాటు డ్రైవర్లకు, కండక్టర్‌లకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. రవాణా శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిబంధనను వెంటనే అమలు చేస్తున్నామన్నారు. కొత్త నిబంధనపై డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన కల్పించామని చెప్పారు.
అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ‘సౌండ్ పొల్యూషన్ చేసే వారిపై కర్ణాటక హైకోర్టులో పిల్ దాఖలు చేయడం గమనార్హం. “ప్రజలు పాటలు, కవితలు, వార్తలు అలాగే సినిమాలను (బస్సుల లోపల) గట్టిగా ప్లే చేస్తున్నారు. దీంతో ఆ సౌండ్ పొల్యూషన్, బస్సుల్లోని ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది. అందువల్ల అధిక వాల్యూమ్‌లలో పాటలను, వీడియోలను ప్లే చేయడానికి మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని తగ్గించాలని పీఐఎల్ ఆదేశించింది.