- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ-కామర్స్‌లో డెలివరీ సిబ్బందికి బీమా సౌకర్యం
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో ఈ-కామర్స్ కంపెనీలకు పని పెరిగింది. ప్రజలు ఆన్‌లైన్ షాపింగ్‌కే మొగ్గు చూపించడంతో ఈ-కామర్స్ విక్రయాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఉత్పత్తులను సరఫరా చేస్తున్న సిబ్బందికి రక్షణ ఏర్పాట్లలో భాగంగా బీమా సౌకర్యం కల్పించాలని ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, స్విగ్గీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. డెలివరీ సిబ్బంది మాత్రమే కాకుండా ఉత్పత్తులను అందించే వ్యాపారులు, భాగస్వాములకు కూడా కొవిడ్ బీమా పాలసీలె ఇప్పించడంపై ఈ-కామస్ర్ కంపెనీలు దృష్టి సారించాయి. డెలివరీ సిబ్బందికి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల విలువైన బీమా పాలసీలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ పాలసీల ప్రీమియం రూ. 2,500 ఉంటోంది. కాలవ్యవధి పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది. ఉద్యోగుల బీమా వ్యాపారం రూ. 7 నుంచి రూ. 8 వేల కోట్ల స్థాయిలో ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో మరింత పెరిగే అవకాశముంది. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ రూ. 3 లక్షల విలువైన మెడికల్, యాక్సిడెంట్ కవర్ కింద, డెలివరీ సిబ్బందికి రూ. 5 లక్షల వరకు కవర్ చేసినట్టు ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ స్పష్టం చేశారు.