- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిందితున్ని కఠినంగా శిక్షించాలి : డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీఎన్‌యం
దిశ ఇబ్రహీంపట్నం: గత మూడు రోజుల క్రితం సింగరేణి కాలనిలో అరేండ్ల చిన్నారిపై, అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఇబ్రహీంపట్నం మండలంలోని పొలంపల్లలి గ్రామంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, పీఎన్‌యం, యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర నాయకులు జగన్ మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునే విధంగా నగరం నడిబొడ్డున, ఆరేండ్ల గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. శంషాబాద్‌లో ప్రియాంక రెడ్డి, హత్యచేసిన దుండగులను ఎన్కౌంటర్ చేసిన విధంగా చైత్రను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో, రాష్ట్రములో రోజు రోజుకు అమ్మాయిల పైన హత్యలు, అత్యాచారాలు, జరుగుతున్న ప్రభుత్వాల చర్యలు మాత్రం నామ మాత్రంగా తీసుకుంటున్నారని అన్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులపైన ఈలాంటి దుశ్చర్యాలకు పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నర్సింహ, వెంకటేష్, అశోక్ , యాదగిరి, డీ వై ఎఫ్ ఐ నాయకులు స్టాలిన్, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు దనేశ్వర్,యువజన సంఘం సభ్యులు రవి, దయాకార్పాల్గోన్నారు.