కార్మికులకు షిప్టుల పద్ధతిలో డ్యూటీలు వేయాలి

by Shyam |   ( Updated:2020-03-29 09:46:57.0  )
కార్మికులకు షిప్టుల పద్ధతిలో డ్యూటీలు వేయాలి
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ కార్మికులకు.. మాస్కులు, గ్లౌజులు,శానిటైజర్లు అందించి.. షిప్టుల పద్ధతిలో డ్యూటీలు వేయాలని. సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో పలు అంశాలు ప్రస్తావిస్తూ.. అత్యవసర సేవల పేరుతో మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులతో ఎక్కువ గంటలు పనిచేయించడతో వారి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. అపరిశుభ్రమైన పనుల్లో నిరంతరం పని చేయడంతో కార్మికులకు వ్యాధి సోకితే ప్రజలకు కూడా విస్తరించే అవకాశం ఉందన్నారు. వారి ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. షిప్టుల పద్దతుల్లో డ్యూటీలు వేయడంతో పాటు అందరికీ ఒక నెల వేతనాన్ని అడ్వాన్స్ చెల్లించాలని సీఎంకు తమ్మినేని వీరభద్రం లేఖలో తెలిపారు.

Tags: Thammini Veerabhadram, comments, manner of shifts, workers, hyderabad

Advertisement

Next Story

Most Viewed