- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇకలేరు
దిశ, వెబ్ డెస్క్: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం రాత్రి 2 గంటల సమయంలో ఆయన మరణించాడు. రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామం. రామలింగారెడ్డి టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.
అంతకు ముందు రామలింగారెడ్డి పాతికేళ్ల పాటు జర్నలిస్టుగా కూడా పని చేశారు. గతంలో పీపుల్స్‌వార్ సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయనపై తొలిసారిగా టాడా కేసు నమోదు చేశారు. 2004లో రామలింగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2008 ఉప ఎన్నికలు, 2014, 2018 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రామలింగారెడ్డికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.