- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదలను రోడ్డుకు లాగింది కేసీఆరే : ఎమ్మెల్యే రఘునందన్ రావు
దిశ, శేరిలింగంపల్లి : నిరుపేదలను రోడ్డున పడేస్తూ వారికి గూడు లేకుండా చేసి అన్యాయంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవరం రఘునందన్ రావు హెచ్చరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డిలోని బసవతారక నగర వాసులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, గజ్జల యోగానంద్, రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఇతర బీజేపీ ముఖ్య నాయకులుతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన భూములను కేటీఆర్ అండ్ కో ఎవరికి కట్టబెట్టేందుకు నిరుపేదలను రోడ్డుకు లాగిందని ప్రశ్నించారు.
బతుకుదెరువు కోసం వలసలు వచ్చి ఉండేందుకు కాస్త గూడు ఏర్పాటు చేసుకోగా.. వాటిని కూల్చి ప్రజలను రోడ్డున పడేశారని, ల్యాప్‌టాప్ ముందేసుకుని చూసే కేటీఆర్‌కు ఇదంతా కనిపించడం లేదా అని అడిగారు. పేదలకు న్యాయం చేసేవరకు పోరాడతామని, కలెక్టర్ గోపన్ పల్లికి గూడు కోల్పోయిన పేదలకు వెంటనే నష్టపరిహారం కల్పించడంతో పాటు వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు యోగానంద్, రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా గోపన్ పల్లి, బసవతారక నగర్‌లో నివాసముంటూ కరెంటు బిల్లు, నల్లా బిల్లు, ఇంటి నెంబర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు హక్కును ఇదే అడ్రస్ మీద కలిగి ఉన్న స్థానికుల ఇళ్లకు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ధ్వంసం చేయటం అమానుషమైన చర్య అని మండిపడ్డారు. పసి పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఉన్నారని మరిచిన ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.