షాకింగ్ న్యూస్.. విడాకుల కోసం రూ.5,555 కోట్ల భరణం ఇచ్చారా..

by Anukaran |
షాకింగ్ న్యూస్.. విడాకుల కోసం రూ.5,555 కోట్ల భరణం ఇచ్చారా..
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్యభర్తల బంధం చాలా గొప్పది అంటారు. ఎంతో ఇష్టంగా కలకాలం కలిసి ఉంటామని పెళ్లి చేసుకొని చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోతుంటారు చాలా మంది. అయితే విడిపోయి విడాకులు తీసుకున్న జంట, తమ భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజాగా కోర్టు దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ భరణం విషయంలో సంచలన తీర్పు వెళ్లడించింది. దీంతో ఈ తీర్పు విన్నవారందరూ బ్రిటిష్ చరిత్రలోనే చాలా ఖరీదైన విడాకులివి అని ముచ్చటించుకుంటున్నారు. ఎందుకు అంత ఖరీదైనవో తెలుసుకుందాం..

దుబాయ్ రాజ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం వయసు 72 ఏళ్లు, ఆయన భార్య జోర్డాన్ రాకుమారి బింత్ అల్ హుసేన్ వయసు 47 ఏళ్లు. వీరు కొన్నేళ్ల క్రితం విడిపోయారు. దీంతో వీరి విడాకుల విషయంపై తాజాగా లండన్ హైకోర్టు విచారణ జరిపి సంచలన తీర్పునిచ్చింది. హుసేన్ తన భార్యకు 554 మిలియన్‌ పౌండ్లు భరణంగా చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పు చెప్పింది. ఇందులో భాగంగానే ముందస్తుగా 2వేల,516 కోట్లు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. మిగతా రూ.2,907 కోట్లు వారి ఇద్దరి సంతానమైన 14 ఏళ్ల అల్‌ జలీలా, 9 ఏళ్ల జయేద్‌కు బ్యాంకు గ్యారంటీతో చెల్లించాలని తెలిపింది. అలాగే తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఇద్దరు పిల్లలకు వారి జీవితాంతం భద్రతా ఖర్చులను భరించాలని కూడా స్పష్టం చేసింది. ఈ విడాకుల భరణం కరెన్సీ ప్రకారం రూ.5,555 కోట్లు కావడంతో ఈ భరణం గురించి విన్నవారందరూ షాక్ అవుతున్నారు. చరిత్రలోనే మళ్లీ ఇంతటి భరణం ఇవ్వరేమో.. రికార్డ్ క్రియేట్ చేసిందంటూ గుసగుసలాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed