నడి రోడ్డులో మందుబాబు హల్ చల్..

by Sridhar Babu |   ( Updated:2024-06-02 14:49:16.0  )
నడి రోడ్డులో మందుబాబు హల్ చల్..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మందుబాబులం మేం మందు బాబులం… మందు కొడ్తే మేం మహా రాజులం అన్న పాటకు అచ్చుగుద్దినట్టుగా వ్యవహరిస్తున్నారు. మద్యపాన ప్రియుల ఆగడాలతో సగటు పౌరుడే కాదు పోలీసులకూ తిప్పలు తప్పడం లేదు. ఓ వైపున మండుతున్న ఎండలో ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌కు విసుగు తెప్పించాడు ఓ మందుబాబు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో రోడ్డుకి అడ్డంగా భారీ కేడ్స్ పెట్టి మరీ వీరంగం సృష్టించాడో మందు బాబు.నిరంతరం రద్దీగా ఉండే తెలంగాణ చౌక్‌లో మందుబాబు హల్ చల్‌తో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అదే చౌరస్తాలో ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్.. మందుబాబును వారించినా వినలేదు. చివరకు ఆ పోలీసు అతనిపై చేయి చేసుకోగా మందుబాబు కూడా కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed