సరికొత్త యాంటీడ్రోన్‌ను రూపొందించిన డీఆర్డీవో

by Shamantha N |
సరికొత్త యాంటీడ్రోన్‌ను రూపొందించిన డీఆర్డీవో
X

దిశ, వెబ్‌డెస్క్: ఉగ్రదాడులు, తీవ్రవాదులు ఉపయోగించే డ్రోన్లను నియంత్రించడంతోపాటు వాటిని కూల్చివేడానికి డీఆర్డీవో నూతనంగా యాంటీ డ్రోన్ ను రూపొందించింది. డీఆర్డీవో సరికొత్త టెక్నాలజీతో ఈ యాంటీడ్రోన్‌ను అభివృద్ధి చేసింది. శత్రు డ్రోన్లను పసిగట్టి కూల్చేసేలా ఈ యాంటీ డ్రోన్ను రూపకల్పన చేశారు. ఇది శక్తివంతమైన జామర్ ద్వారా డ్రోన్ సిగ్నల్ పనిచేయకుండా చేయడం, లేజర్ కిరణాలు ఉపయోగించి డ్రోన్లను ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. మూడు కిలోమీటర్ల వరకు డ్రోన్ సిగ్నల్‌ను జామ్ చేసే కెపాసిటి దీని సొంతం. 1.25 కిలోమీటర్ల దూరం వరకు లేజర్ కిరణాలతో లక్ష్యాన్ని ఛేదించి ధ్వంసం చేయగలదీ యాంటీ డ్రోన్. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ పరికరాన్ని వినియోగించనున్నట్లు డీఆర్డీవో అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed