- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆఖరి నిమిషంలో గోల్ చేసిన గోవా.. ఓటములకు చెక్
దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020-21 సీజన్‌లో భాగంగా బుధవారం రాత్రి తిలక్ మైదాన్ స్టేడియంలో జంషెడ్‌పూర్‌తో జరగిన మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ 2-1 తేడాతో విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌లలో వరుసగా పరాజయం పాలైన గోవా జట్టు ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో గోల్ కొట్టి అద్బుత విజయం సాధించింది. టాస్ గెల్చిన గోవా క్లబ్ కుడి నుంచి ఎడమకు ఎటాక్ చేయడానికి నిర్ణయించకుంది.
వరుస ఓటములతో నిరాశలో ఉన్న గోవాను జెంషెడ్‌పూర్ క్లబ్ మొదటి నుంచే టార్గెట్ చేసింది. దూకుడుగా ఆడుతూ గోవా డిఫెన్స్‌ను బద్దలు చేయడానికి పలుమార్లు ప్రయత్నించింది. ఈ క్రమంలో 33వ నిమిషంలో జెంషెడ్‌పూర్ గోల్ కొట్టింది. మాన్రోయ్ ఇచ్చిన పాస్‌ను గోల్ పోస్టులోకి పంపిన స్టెఫెన్ జెంషెడ్‌పూర్‌కు 1-0 ఆధిక్యాన్ని తీసుకొచ్చాడు. తొలి అర్దభాగంలో ఆధిక్యత సంపాదించిన జెంషెడ్‌పూర్ జట్టు అదే దూకుడును కొనసాగించింది. కానీ 63వ నిమిషంలో గోవాకు పెనాల్టీ లభించింది. ఇగొర్ అంగులో ఎలాంటి తప్పిదం చేయకుండా పెనాల్టీని గోల్‌గా మార్చాడు. దీంతో ఇరుజట్ల స్కోర్ సమం అయ్యాయి.
చివరి వరకు స్కోర్ సమానంగానే ఉన్నది. గోల్ కోసం ఇరుజట్లు కష్టపడ్డాయి. మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా ఇగోర్ అంగులో గోల్ కొట్టాడు. దీంతో గోవా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వరుసగా రెండు ఓటములు చూసిన గోవా ఎట్టకేలకు విజయం సాధించింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు ఎడ్యూ బెడియా, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జార్జ్ మెండోజాకు లభించింది.